2003 వరల్డ్ కప్‌లో విధ్వంసం సృష్టించిన బ్యాట్ఇదే.. రికీ పాంటింగ్
Ricky Ponting: 2003 క్రికెట్ వన్డే వరల్డ్ కప్‌లో రికీ పాంటింగ్ 8 సిక్సులతో చెలరేగి 140 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా 359 పరుగులతో ఇన్సింగ్స్ ముగించింది. ఈ మ్యాచ్‌లో ఇండియా బ్యాటర్లు చేతులెత్తేయగా.. భారీ పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత రికీ పాంటింగ్ యూజ్ చేసిన బ్యాట్‌లో స్ప్రింగ్స్ పెట్టుకున్నాడని అందుకే అన్ని సిక్సులు బాదగలిగాడని ఆరోపణలు వచ్చాయి.
టీం ఇండియా క్రికెట్ అభిమానులు ఆ సమయంలో వరల్డ్ కప్ ఓటమిని జీర్ణించుకోలేక అలా అనుకున్నారు. అయితే ఇప్పటికీ అలాంటి రూమర్స్ వస్తూనే ఉంటాయి. రూమర్స్‌కు చెక్ పెట్టేందుకు రికీ పాంటింగ్ వరల్డ్ కప్ ఫైనల్ లో సెంచరీ చేసిన బ్యాట్‌ను తన ఎక్స్ (ట్విటర్)లో పోస్టు చేశాడు.
మనం ఏమైనా సాధించామంటే అత్యంత అమూల్యమైనదిగా భావిస్తాం. నాకైతే ఇది స్పెషల్ అంటూ వరల్డ్ కప్ ఫైనల్లో వాడిన బ్యాట్ ఫొటోను షేర్ చేశాడు. దీంతో ఇండియా ఫ్యాన్స్ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. బ్యాట్ సరే దానిలోని స్ప్రింగ్స్‌ను కూడా చూపాలని కోరుతున్నారు. రికీ పాంటింగ్ ఆ రోజు చేసిన విధ్వంసంతో ఇండియాకు వరల్డ్ కప్ దూరమైంది.
రికీ పాంటింగ్ సారథ్యంలో రెండు సార్లు ఆస్ట్రేలియా క్రికెట్ వన్డే వరల్డ్ కప్ గెలుచుకుంది. 2003లో రికీ పాంటింగ్ ఫైనల్లో సెంచరీ చేయగా.. 2007లో అడమ్ గిల్ క్రిస్ట్ సెంచరీతో చెలరేగి ఆసీస్‌కు టైటిల్ అందించారు. 2007 లో అడమ్ గిల్ క్రిస్ట్ సెంచరీ తర్వాత గ్లవ్స్ నుంచి చిన్న బాల్ తీసి చూపిస్తాడు. అప్పుడు కూడా అది వివాదంగా మారింది. కానీ టైటిల్ పోయిన తర్వాత ఏం చేస్తాం. అందుకే 2003 వరల్డ్ కప్‌లో జరిగిన విషయాలు ఎప్పటికీ మరిచిపోలేం.