qualifications of Team India Cricket Coach
qualifications of Team India Cricket Coach

qualifications of Team India Cricket Coach టీం ఇండియా క్రికెట్ కోచ్ అర్హతలు ఇవే..

qualifications of Team India Cricket Coach: టీం ఇండియా క్రికెట్ కోసం కొత్తగా దరఖాస్తులు చేసుకునే వారికి అవకాశం కల్పిస్తున్నట్లు బీసీసీఐ నోటిఫికేషన్ విడుదల చేసింది. టీం ఇండియా క్రికెట్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం మరి కొన్ని రోజుల్లో ముగియనుండగా.. బీసీసీఐ సెక్రటరీ ముందుగానే చెప్పినట్లు ప్రకటన విడుదల చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా విడుదలైన ప్రకటనలో కోచ్ పదవికి కావాల్సిన అర్హతలు, వేతనం వివరాలు తెలియజేశారు.

ఈ కొత్త కోచ్ పదవీ కాలం జూలై 1 నుంచి 2024 నుంచి 2027 డిసెంబర్ వరకు ఉంటుంది. అంటే 2027 వరల్డ్ కప్ ముగిసే వరకు కోచ్ పదవిలో ఉంటారు. ద్రవిడ్ కూడా ఈ పదవికి అప్లై చేసుకోవచ్చని బీసీసీఐ సూచించింది. కానీ రాహుల్ ద్రవిడ్ పెద్దగా ఆసక్తి చూపుతున్నట్లు కనిపించడం లేదు.

అయితే ఈ కోచ్ పదవికి 60 ఏండ్ల లోపు వారై ఉండాలని, కనీసం 30 టెస్టులు లేదా 60 వన్డేలు ఆడి ఉండాలని నిబంధనలు పెట్టింది. ఇండియా నుంచే కాకుండా విదేశీ కోచ్‌లు అయినా అప్లై చేసుకోవచ్చని తెలిపింది. మే 27 వరకు దరఖాస్తులు పెట్టుకోవడానికి చివరి తేదీ అని తెలిపింది. కోచ్‌ను ఎంపిక చేయడానికి ఇంటర్వ్యూ కూడా ఉంటుందని బీసీసీఐ పేర్కొంది. టీం ఇండియా కోచ్ పదవీకి అప్లై చేసుకోవాలనుకునే వారు.. కనీసం టెస్టులు ఆడే జట్టుకు రెండు సంవత్సరాలు పని చేసి ఉండాలి. లేదా ఏదైనా ఫ్రాంచైజీ ఐపీఎల్ లేదా.. ఇతర టీంలకు మూడు సంవత్సరాలుగా కోచ్‌గా బాధ్యతలు నెరవేర్చి ఉండాలి.

కోచ్ వేతనం అనేది అతడి సీనియారిటీ, కోచింగ్ స్కిల్‌ను బట్టి నిర్ణయిస్తామని తెలిపింది. టీంకు 14 నుంచి 16 మంది కోచింగ్ స్టాఫ్ ఉంటారని వారందరూ కోచ్ కింద పని చేస్తారని చెప్పింది. సపోర్టు స్టాఫ్ కోసం కూడా అప్లై చేసుకోవచ్చని బీసీసీఐ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *