Worst umpiring in IPL 2024 season with umpiring blunders : ఐపీఎల్ 2024 సీజన్‌లో అంపైరింగ్‌లో తప్పిదాలతో చెత్త అంపైరింగ్ మూటగట్టుకుంది. ఈ సీజన్‌లో వైడ్ బాల్స్‌కు కూడా రివ్యూ ఇచ్చే సిస్టం పెట్టుకున్నా.. థర్డ్ అంపైర్లు ఇచ్చిన కొన్ని డిసెషన్లు చూసి ముక్కున వేలేసుకోవాల్సిందే. టీవీలో రిప్లేలు చూసి కూడా సరైన డెసిషన్ ఇవ్వకపోవడం పట్ల క్రికెటర్లు, అభిమానులు
ఇదేం అంపైరింగ్ రా బాబోయ్ అనుకుంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.
సంజుశాంసన్ ఢిల్లీపై అవుటైన తీరు అంపైరింగ్ తీరును తప్పుబట్టేలా చేస్తోంది. టీవీల్లో మళ్లీ మళ్లీ రిప్లేలు చూస్తూ కూడా ఇలా ఇవ్వడం వెనక ఉన్న అసలు కారణమేంటో తెలియడం లేదు. సంజు శాంసన్ కొట్టిన షాట్‌ను ఢిల్లీ ఫీల్డర్ షై హోప్ బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పట్టాడు. అయితే రివ్యూకు వెళ్లిన సంజుకు షాక్ తగిలింది. ఒక యాంగిల్‌లో హోప్ బౌండరీ రోప్‌కు తగిలినట్లు స్పష్టంగా కనిపిస్తున్న థర్డ్ అంపైర్ అవుట్ ఇవ్వలేదు. దీంతో సంజు అంపైర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
విరాట్ కొహ్లి కోల్‌కతా బౌలర్ హర్షిత్ రాణా బౌలింగ్‌లో టాస్ బాల్‌కు ఔటైన విధానం చర్చనీయాంశంగా మారింది. నో బాల్ అని రిప్లైలో స్పష్టంగా తెలుస్తున్నా కొహ్లిని అవుట్ ఇవ్వడంతో విరాట్ నిరాశగా వెనుదిరిగాడు. దీంతో అంపైరింగ్‌పై నమ్మకం కోల్పోయేలా చేశారంటూ ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు.
అయుష్ బదోని రనౌట్, మోహిత్ శర్మ వైడ్ బాల్ వివాదం.. సన్వీర్ సింగ్ క్యాచ్, కరణ్ శర్మ బ్యాటింగ్‌లో కోల్‌కతా కీపర్ పిల్ సాల్ట్ పట్టిన క్యాచ్ నాటౌట్ ఇవ్వడం ఇలా ఒకే సీజన్‌లో ఇన్ని వివాదాలు రావడం ఇదే మొదటి సారి అని ప్రేక్షకులు, క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అంపైర్లపై మండిపడుతున్నారు. ముఖ్యంగా టీ 20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అతి పెద్ద లీగ్‌లో ఇలాంటి అంపైరింగ్ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి అంపైరింగ్ ఇంటర్నేషనల్ మ్యాచుల్లో చేస్తే ఎంతటి దారుణాలు జరుగుతాయోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.