Virender Sehwag, was furious with the owner of Lucknow : లక్నో యజమానిపై టీం ఇండియా మాజీ డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వగ్ మండిపడ్డాడు. నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ వి.. ప్రాఫిట్ వచ్చిందా లేదా లాస్ వచ్చిందా అని చూసుకోవాలి. కానీ క్రికెట్ గేమ్‌లో వేలు పెట్టడం సరికాదని లక్నో ఓనర్ సంజయ్ గోయెంకకు సలహా ఇచ్చాడు. అసలు ఓనర్ జాబ్ ఏంటి క్రికెట్ గేమ్‌లో ఎలా ఆడాలో చెప్పడమా.. అసలు ఎలా ఆడాలో మీరు చెబుతారా?
మీకు ఫ్రాంచైజీతో లాభం వచ్చిందా… నష్టం వచ్చిందా అని చూసుకోండని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడైనా ఎవరికైనా చెప్పాలనుకుంటే ప్లేయర్లు మోటివేషన్‌గా తీసుకునేలా పాజిటివ్‌గా మాట్లాడండి. కానీ మీడియా ముందు బౌండరీ లైన్ దగ్గరకు వచ్చి ఒక టీం కెప్టెన్, ఇండియా క్రికెటర్‌పై రెచ్చిపోయేలా మాట్లాడడానికి మీరెవరూ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
అసలు ప్రాంచైజీ ఓనర్‌కు గెలుపొటములపై క్రీడాకారులతో చర్చించడానికి లేదు. దానికి సంబంధించిన కోచింగ్ స్టాఫ్ ఉంది. ఏది ఉన్నా సరే వారు చూసుకుంటారు. కానీ ఓనర్స్‌కు ఎలాంటి సంబంధం ఉండదు. ఒక వేళ మాట్లాడాల్సి వస్తే పక్కన నాలుగు గోడల చాటున డిస్కషన్ చేసుకోవాలి. కానీ డబ్బులు ఇస్తున్నాం.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడతాను అనే విధానం మానుకోవాలని సంజయ్ గోయెంకాకు చాలా మంది క్రికెటర్లు సూచన ఇస్తున్నారు.
సంజయ్ గోయెంకా గతంలో దోనితో ఇలాగే ప్రవర్తించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సంజయ్ గోయెంకా ప్రవర్తన తీరే ఇలాగా అంటూ తిట్టిపోస్తున్నారు. క్రికెట్‌లో ప్లేయర్లతో సంభాషించడానికి క్రికెట్ కోచింగ్ స్టాఫ్ ఉంటుంది. మ్యాచ్ అనంతరం ఎలా ఆడితే బాగుంటుంది. నెక్ట్స్ మ్యాచ్ ఎలా ఆడాలో అన్ని చర్చించి బరిలోకి దిగుతారు. ఈ వివాదంపై షమీ కూడా స్పందించాడు. లక్నో ఓనర్ గనక రాహుల్‌తో ఇలా మాట్లాడటం సరైనది కాదని చెప్పాడు.