RCB This is not an ordinary success: ఆర్సీబీ అసాధారణ ఆటతీరుతో ప్లే ఆఫ్‌కు చేరుకుంది. వరుసగా ఆరు మ్యాచులు గెలిచి ప్లే ఆఫ్‌కు చేరుకుంది. అయితే మొదటి భాగంలో ఎనిమిది మ్యాచుల్లో కేవలం ఒక్కటే గెలిచిన ఆర్సీబీ చివరి ఆరు మ్యాచుల్లో గెలిచి ఔరా అనిపించుకుంది. చెన్నైతో బెంగళూరులో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసి 218 పరుగులు చేసి చెన్నైను 191 పరుగులకే కట్టడి చేసింది.
రచిన్ రవీంద్ర 61 పరుగులతో రాణించినా కీలక సమయంలో రనౌట్ కావడంతో చెన్నై వెనకబడింది. కానీ రవీంద్ర జడేజా, ధోని ఇద్దరూ చెలరేగి ఆడటంతో చివరి ఓవర్‌లో కేవలం 17 పరుగులు చేస్తే ప్లే ఆఫ్‌కు అర్హత సాధించేది. కానీ యశ్ దయాల్ చివరి ఓవర్‌లో ధోని ఫస్ట్ బాల్‌కే సిక్సు కొట్టి ప్రెషర్ పెంచేశాడు. ఈ సిక్సు స్టేడియం అవతల పడింది.
అయితే తర్వాత బాల్‌కు ఎంఎస్ అవుట్ కావడంతో నాలుగు బంతుల్లో 11 పరుగులు కావాలి. ఈ దశలో శార్దూల్ ఠాకూర్ క్రీజులోకి రాగా ఫస్ట్ బాల్ డాట్ చేశాడు. కానీ తర్వాత బాల్‌కు రన్ తీయగా.. జడేజా లాస్ట్ రెండు బాల్స్‌ను డాట్ చేశాడు. దీంతో ఆర్సీబీ సంబురాల్లో మునిగి పోయింది.
దీంతో ఆర్సీబీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఏ మాత్రం ఆశలు లేని దశ నుంచి పాయింట్స్ టేబల్స్‌లో చివర ఉన్న ప్లేస్ నుంచి ఏకంగా ప్లే ఆఫ్‌కు చేరుకుంది. అయితే విరాట్ కొహ్లి ఈ సీజన్‌లో బ్యాటింగ్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఆరెంజ్ క్యాప్ సాధించి టీమ్‌ను ముందుండి నడిపిస్తున్నాడు. అయితే ఆర్సీబీ నాలుగో స్థానంలో ఉండగా.. మూడో స్థానంలో ఉన్న జట్టుతో ప్లే ఆఫ్‌లో తలపడనుంది.