Arjun Tendulkar
Arjun Tendulkar

Arjun Tendulkar: అర్జున్ టెండ్కూలర్ భయపడ్డాడా?

Arjun Tendulkar: అర్జున్ టెండూల్కర్ సచిన్ టెండూల్కర్ కొడుకుగా ఎన్నో అంచనాలతో బరిలోకి దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఆయనకు ఏదీ కలిసి రావడం లేదు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ గత మూడు సీజన్‌లుగా అర్జున్ టెండూల్కర్‌ను తీసుకుంటూనే ఉంది. బేస్ ప్రైజ్ 20 లక్షలతో అర్జున్‌ను టీంలో చేర్చుకుంటుంది.

గత సీజన్‌లో రెండు మ్యాచుల్లో అవకాశం ఇచ్చిన ముంబై ఈ సారి చివరి లీగ్ మ్యాచ్‌లో ఆడేందుకు చాన్స్ కల్పించింది. అర్జున్ 2.2 ఓవర్లలోనే 22 పరుగులు ఇచ్చి గాయమైందని వెళ్లి డగౌట్‌లో కూర్చున్నాడు. 2 ఓవర్లు బాగానే బౌలింగ్ చేసిన అర్జున్ మూడు ఓవర్‌కు వచ్చేసరికి మొదటి రెండు బంతుల్లోనే రెండు సిక్సులు నికోలస్ పూరన్ బాదాడు. దీంతో అతడికి బౌలింగ్ చేయాలంటనే భయపడి వెనక్కి వెళ్లిపోయాడని ట్రోల్స్ చేస్తున్నారు.

అర్జున్ పూరన్‌కు భయపడి వెళ్లిపోయాడని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై నెట్టింట బాగా ట్రోల్స్ అవుతున్నాయి. సచిన్ వారసత్వాన్ని అందిపుచ్చుకుని గ్రేట్ బ్యాటర్‌గా నిలుస్తాడని అనుకున్న ప్రతి ఒక్కరిని అర్జున్ చాలా నిరాశ పరుస్తున్నాడు. బౌలింగ్‌లో పదునైన స్వింగ్, పేస్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా అంత పెద్ద సెలబ్రేటీ కొడుకు అనే సరికి అంచనాలు ఎక్కువగా పెట్టుకుంటున్నారు. దీంతో దాన్ని చేరుకోలేక పోతున్నాడు.

అర్జున్ మొదటి రెండు ఓవర్లు చాలా బాగా బౌలింగ్ చేశాడు. గ్రేట్ బ్యాటర్ మార్కస్ స్టోయినిస్‌కు స్వింగ్, యార్కర్, షార్ట్ పిచ్ బంతులు వేసి ఇబ్బందులకు గురి చేశాడు. బుమ్రా స్థానంలో చోటు దక్కించుకున్న అర్జున్ తొలి రెండు ఓవర్లు బుమ్రా లేని లోటు తీర్చాడు. స్టోనియిస్ ఎల్బీగా అవుట్ చేయగా.. రిప్లేలో బంతి వికెట్ల కంటే పైకి వెళుతుందని తేలడంతో నాటౌట్‌గా ప్రకటించారు. మొదటి రెండు ఓవర్లు చాలా అగ్రెసివ్‌గా అర్జున్ బౌలింగ్ చేశాడు. తర్వాత 15వ ఓవర్‌లో నికోలస్ పూరన్ రెండు బంతుల్లో రెండు సిక్సులు కొట్టగానే గాయమైందని డగౌట్‌కు వెళ్లిపోయాడు. దీంతో అతడు భయపడ్డాడని అందరూ అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *