T20 World Cup: అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న పొట్టి ప్రపంచ కప్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. డల్లాస్ లోని గ్రాండ్ ప్యారీ స్టేడియంలో అమెరికా, కెనడా మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. డల్లాస్, గయానా, బార్బడోస్, న్యూయార్క్, నార్త్ ల్యాండ్ అంటిగ్వా, ల్యాడర్ హిల్ ప్లోరిడా, కింగ్స్ టన్ సెయింట్ విన్సెంట్, సెయింట్ లూసియా, ట్రినిడాడ్ నగరాల్లో మ్యాచులు జరగనున్నాయి
. అమెరికా దేశం ఆతిథ్య హోదాలో టోర్నీకి అర్హత సాధించగా.. ఈ మధ్యే తనకంటే బలమైన బంగ్లాదేశ్ పై రెండు టీ 20 మ్యాచులు గెలిచి టోర్నీలో ఆత్మవిశ్వాసంతో అడుగుపెడుతోంది. అమెరికా జట్టులో మొత్తం 7 గురు ఇండియా సంతతికి చెందిన వారు. ఒకరు పాకిస్థాన్, మరొకరు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ ఇలా అన్ని దేశాల వారు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
యూఎస్ కెనడా ఇప్పటి వరకు ఏడు సార్లు పోటీ పడగా.. అమెరికా అయిదు సార్లు విజయం సాధించింది. రెండు సార్లు మాత్రమే కెనడా గెలిచింది. గ్రాండ్ ఫ్యారీ స్టేడియంలో ఏవరేజ్ స్కోరు 167 కాగా.. ఇప్పటి వరకు 12 మ్యాచుల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లే 8 సార్లు గెలిచాయి. దీంతో ఈ పిచ్ మీద మొదట బ్యాటింగ్ చేయడానికే టాస్ గెలిచిన జట్టు మొగ్గు చూపనుంది.
గుజరాత్ రాష్ట్రానికి చెందిన మోనంక్ పటేల్ వలస వెళ్లి అమెరికా టీంకు ఆడగా.. ప్రస్తుతం టీ 20 వరల్డ్ కప్ లో మోనాంక్ పటేల్ కెప్టెన్ గా అమెరికా దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. మోనాంక్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్. మంచి పవర్ హిట్టింగ్ తో బ్యాటింగ్ చేయగల సమర్థుడు. లోయర్ ఆర్డర్ లో కోరే అండర్సన్, హర్మిత్ పటేల్ విధ్వంసకర బ్యాటింగ్ చేయగలరు. దీంతో కెనడా కంటే అమెరికానే ఈ మ్యాచ్ లో ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది.