Nirmal District Collectorate: ఆదివారం జరగబోయే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముస్తాబవుతోంది. కార్యాలయం ఆవరణలో అవతరణ దినోత్సవం సందర్భంగా దశాబ్ద కాలంలో జరిగిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యమకారుల స్ఫూర్తిపై జిల్లా కలెక్టర్ ప్రసంగించనున్నారు. అనంతరం కళాకారుల ఆటపాట, పలువురికి సన్మానం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అవతరణ దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతున్నారు.