Trasma
Trasma

Trasma: ఏఎస్పీని కలిసిన ట్రాస్మా అధ్యక్షులు

Trasma: నిర్మల్, డిసెంబర్ 12 (మన బలగం): నిర్మల్ జిల్లా నూతన ఏఎస్పీగా బదిలీపై వచ్చిన ఉపేందర్ రెడ్డిని నిర్మల్ జిల్లా ట్రస్మా అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో ఇదివరకు డీఎస్పీగా నాలుగు సంవత్సరాల సేవలందించిన అనుభవం ఉందని, ఆ సమయంలో ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలను తీరుస్తూ అందరితో కలుపుగోలుగా ఉండే ఉపేందర్ రెడ్డి చేసిన సేవలను కొనియాడుతూ మరలా నిర్మల్ జిల్లా అదనపు ఎస్పీగా కూడా తమ సేవలందించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోన్ మండల జడ్పీటీసీ జీవన్ రెడ్డి, ప్రేమ్ కుమార్‌లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *