Punjab assistant coach Brad Haddin : పంజాబ్, ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆరు క్యాచ్‌లు వదిలేయడంతోనే ఓడిపోవాల్సి వచ్చిందని పంజాబ్ అసిస్టెంట్ కోచ్ బ్రాడ్ హడిన్ ఆవేదన వ్యక్తం చేశారు. దర్శశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు ఇచ్చిన ఆరు క్యాచులు పంజాబ్ ఫీల్డర్లు విడిచిపెట్టారు. కావేరప్ప బౌలింగ్‌లో విరాట్ కొహ్లి సున్నా పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ను అశుతోష్ జారవిడిచాడు.
అనంతరం పది పరుగుల వద్ద విరాట్ కొహ్లి క్యాచ్‌ను మళ్లీ విడిచిపెట్టిన పంజాబ్ ఫీల్డర్లు భారీ మూల్యం చెల్లించుకున్నారు. రజత్ పటిదార్ కూడా మొదట డకౌట్‌గా వెనుదిరగాల్సి ఉండగా.. క్యాచ్ విడిచిపెట్టడంతో చెలరేగి ఆడిన రజత్ 55 పరుగులు చేసి ఆరు సిక్సులు బాదాడు. ఒక టీ 20 మ్యాచ్‌లో ఆరు క్యాచులు జారవిడవడం అంటే మామూలు విషయం కాదు.
పంజాబ్‌కు డు ఆర్ డై మ్యాచ్‌లో ఇలాంటి ఫీల్డింగ్‌ను ఎవరూ ఊహించి ఉండరు. కానీ చెత్త ఫీల్డింగ్‌కు మూల్యం మాత్రం చెల్లించుకున్నారు. ఈ మ్యాచులో ఓడిపోయి ఐపీఎల్ 17వ సీజన్‌లో ఎలిమినేట్ అయిన రెండో టీమ్‌గా పంజాబ్ టీం నిలిచింది. ఇప్పటివరకు పంజాబ్ టీం 17 సీజన్లలో ఒక్కసారి మాత్రమే ఫైనల్‌కు చేరింది. మొదటి ఇన్సింగ్స్‌లో బాగానే పరుగులు చేసినా.. కోల్‌కతా బ్యాటర్లు సమష్టిగా రాణించి కప్ ఎగురేసుకపోయారు. ఇక అక్కడి నుంచి ఏనాడు ఫైనల్ వరకు పంజాబ్ రాలేదు.
ఈ సీజన్‌లో మాత్రం ఎలిమినేట్ అయినప్పటికీ యంగ్ స్టార్లు రాణించడం ఆ జట్టుకు ఊరటనిచ్చే విషయం.. శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ ఇద్దరు కలిసి అద్భుతమైన ఇన్సింగ్స్‌లు ఆడారు. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో అశుతోష్ 8 సిక్సులతో చెలరేగి ఆడి గెలిపించినంత పని చేశాడు. శశాంక్ సింగ్ అయితే ప్రతి మ్యాచ్‌లో దాదాపు 30 పరుగులు చేస్తూ జట్టును ఆదుకుంటున్నాడు. వచ్చే సీజన్‌లో అయినా పంజాబ్ టీం కప్ గెలవాలని ఆశిద్దాం.