Indian Team Coach Rahul Dravid : భారత జట్టు క్రికెట్ కోచ్ ద్రవిడ్ పొట్టి ప్రపంచకప్ తర్వాత కనిపించకపోవచ్చు. బీసీసీఐ సెక్రటరీ జైషా మాటల ప్రకారం.. ఇండియా టీం కోచింగ్ స్టాఫ్‌కు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ద్రవిడ్ చేసుకోవచ్చని అన్నాడు. ఈ మాటలను బట్టి ద్రవిడ్ కోచ్‌గా ఈ పొట్టి ప్రపంచకప్పే చివరిది కానుందని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అనుకుంటున్నారు.
టీం ఇండియాకు 2021 నుంచి 2023 వరకు ద్రవిడ్ పదవీ కాలం ఉండగా.. వన్డే వరల్డ్ కప్‌లో జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చడంతో ద్రవిడ్ పదవీ కాలాన్ని పొడిగించారు. ఈ పొట్టి ప్రపంచ కప్ వరకు బీసీసీఐ పెద్దలు ద్రవిడ్ పదవీ కాలాన్ని పొడిగించగా.. ప్రస్తుతం జైషా వ్యాఖ్యలతో ద్రవిడ్ ఇక కోచ్‌గా కొనసాగకపోవచ్చు. ఇండియా క్రికెట్ టీంకు టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కోచ్ పదవికీ ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని జైషా ప్రకటించారు.
జైషా మాటల ప్రకారం.. ఇండియాలో క్రికెట్ ఆడిన సీనియర్ ఆటగాడిని సెలెక్ట్ చేస్తారా.. లేక విదేశీ కోచ్‌ను తీసుకొస్తారా అనేది చూడాలి. రాహుల్ ద్రవిడ్‌కు ఇంకా కోచ్‌గా కొనసాగడం ఇష్టం లేకపోవడమే కొత్త కోచ్ అంశం తెరమీదకు వచ్చిందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ ద్రవిడ్ కెరీర్‌లో అత్యుత్తమ ఆటగాడిగానే కాకుండా బెస్ట్ కోచ్‌గా పేరు సంపాదించుకున్నాడు.
ఇండియా క్రికెట్ టీంకు ఒక్కరే కోచ్‌గా ఉండాలా.. లేక మూడు ఫార్మాట్లకు వేరే వేరే కోచ్‌లు ఉండాలా అనేది క్రికెట్ అడ్వైసరీ కమిటీ నిర్ణయిస్తుందని జైషా తెలిపాడు. ఈ కమిటీలో జతిన్ పరాన్జీ, అశోక్ మల్హోత్రా, సులక్షన నాయక్‌లు ఉన్నారు. వీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. విరాట్ కొహ్లి, రిషబ్ పంత్, బుమ్రా లాంటి వాళ్లు మూడు ఫార్మాట్లలో ఆడుతున్నారు. కాబట్టి మూడు ఫార్మాట్లకు సరిపోయే కోచ్‌ను నియమిస్తారా.. లేక వన్డే, టీ20 కి ఒకరు, టెస్టులకు వేరే వ్యక్తిని సెలెక్ట్ చేస్తారా అనేది త్వరలో తేలనుంది.