Munbai Captain Hardi Pandya: ముంబయి ఇండియన్స్ టీం అయిదు సార్లు ఐపీఎల్ కప్ గెలిచి స్ట్రాంగ్ టీంగా నిలిచింది. ఇందులో అయిదు సార్లు కూడా రోహిత్ శర్మనే కెప్టెన్‌గా ఉన్నాడు. రోహిత్‌ను కాదని హార్ధిక్ పాండ్యాను ముంబయి జట్టు కెప్టెన్‌గా చేసింది. దీన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. అదే తీరులో కూడా ముంబయి ఇండియన్స్ ఆట సాగుతోంది. ఇప్పటికే 12 మ్యాచులు ఆడిన ముంబయి నాలుగు మ్యాచులు మాత్రమే గెలిచి టోర్నీ నుంచి ఫస్ట్ ఎలిమినేట్ అయిన జట్టుగా పరువు పోగొట్టుకుంది.
హార్ధిక్ పాండ్యా కంటే టీంలో సీనియర్లు ఉన్నారు. వారికి హార్దిక్ రెస్పెక్ట్ ఇవ్వడం లేదనే విషయం గ్రౌండ్ లోనే చూస్తే అర్థమవుతుంది. రోహిత్ శర్మను థర్డ్ మ్యాన్లోకి ఫీల్డింగ్‌కు పంపడం నుంచి.. గ్రౌండ్లో అతడి ఆటిట్యూడ్ ఎవరికీ నచ్చడం లేదు. హార్దిక్ పాండ్యా అచ్చం డ్రెస్సింగ్ రూంలో కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నాడని దీనిపై ఒక్కొక్కరితో టీం మేనేజ్ మెంట్ మాట్లాడినట్లు తెలుస్తోంది.
అసలు హార్దిక్ కెప్టెన్సీలో చేయడంలో మీకు వచ్చిన ఇబ్బంది ఏంటీ? అసలు సమస్య ఎక్కడ వస్తుందని అడిగింది. హార్దిక్ కూడా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో తిలక్ వర్మపై నేరుగానే విమర్శలు చేశాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ తిలక్‌కు లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ అక్షర్ పటేల్ బౌలింగ్ చేస్తుంటే సరిగా ఆడలేకపోయాడని అందుకే మ్యాచ్ ఓడిపోయామని అన్నాడు. దీంతో హార్దిక్‌పై ట్రోల్స్ మరింత పెరిగాయి.
ఢిల్లీతో మ్యాచ్‌లో తిలక్ వర్మనే టాప్ స్కోరర్ కాగా.. అతడిపైనే నిందలు వేయడం సరైంది కాదని పలువురు మాజీ క్రికెటర్లు పాండ్యా తీరును తప్పుబట్టారు. హార్దిక్ పాండ్యాకు కాస్త తలపొగరు వచ్చినట్లు కనిపిస్తోందని తాజాగా ఏబీ డివిలియర్స్ కామెంట్స్ చేశారు. దీంతో హార్దిక్‌పై ముప్పేట విమర్శల దాడి పెరుగుతోంది. ముంబయి కెప్టెన్సీ ఏమో గానీ అతడి ఆటిట్యూడ్ నచ్చక అందరితో చెడ్డవాడని పేరు తెచ్చుకుంటున్నాడు. ఒక ఇండియా టీంకు ఆడే వ్యక్తిపై ఇలాంటి కామెంట్లు రావడం నిజంగా బాధాకరమే.