Trollers rage against Lucknow owner: లక్నో సన్ రైజర్స్ మ్యాచ్‌లో లక్నో మొదటి బ్యాటింగ్ చేసి ముక్కీ మూలిగి కేవలం 165 పరుగులు చేసింది. గత రాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షం కురవడంతో మొదట బ్యాటింగ్ చేసిన పిచ్ కాస్త స్లోగా ఉండడంతో బ్యాటర్లు అసౌకర్యానికి గురయ్యారు. అదే స్థాయిలో వికెట్లు కూడా పడిపోవడంతో ఆయుశ్ బదోని, నికోలస్ పూరన్ ఇద్దరు కలిసి బాధ్యాతయుత ఇన్సింగ్స్ ఆడి జట్టుకు 165 పరుగుల గౌరవప్రద స్కోరు అందించారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సన్ రైజర్స్ బ్యాట్స్‌మెన్ కొట్టుడికి లక్నో బౌలర్ల దగ్గర సమాధానం లేకపోయింది. బంతి పడితే చాలు సిక్సు, ఫోర్ అన్నట్లు బాదారు. హెడ్ 30 బంతుల్లో 89 పరుగులు చేస్తే, అభిషేక్ శర్మ 28 బంతుల్లో 76 స్కోరు చేసి శభాష్ అనిపించుకున్నారు. అయితే మ్యాచ్ అనంతరం లక్నో సూపర్ గెయింట్స్ ఓనర్ గోయెంకాకు, లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‌లకు మధ్య వాగ్వాదం జరిగింది.
లక్నో కెప్టెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంజయ్ గోయెంకా మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ సమయంలో కేఎల్ రాహుల్ ఏదో చెప్పడానికి ప్రయత్నించగా.. గోయెంకా వినకుండా రాహుల్‌పై ఫైర్ అవుతూనే ఉన్నాడు. దీంతో ఈ వీడియో చూసిన చాలా మంది ఫ్యాన్స్ నీ కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేసే వాడనుకుంటున్నవా.. టీం ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్. రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకో.. అంటూ గోయెంకాపై విరుచుకుపడుతున్నారు.
రాహుల్ బాయ్ నువ్వు నీ సొంత నగరం బెంగళూరు ఆడు. ఇటు వచ్చేయ్ అన్న అంటూ రాహుల్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. కేఎల్ రాహుల్ కూడా ఒకనొక సమయంలో ఆర్సీబీకీ ఆడటం అంటే ఎంతో ఇష్టమని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అభిమానులు మాత్రం గోయెంకా తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు.