Ricky Ponting: జేమ్స్ ఫ్రేజర్ మెక్ గుర్క్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐపీఎల్‌లో భీకర ఇన్సింగ్స్‌లు ఆడాడు. దాదాపు 234 స్ట్రైక్ రేటుతో ఎక్కువ పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ మెరుగైన ప్రదర్శనతో టోర్నీ నుంచి వైదొలిగింది.
22 ఏళ్ల యంగ్ ఆసీస్ క్రికెటర్ జేమ్స్ ఫ్రేజర్ మెక్ గుర్క్‌కు టీ 20 వరల్డ్ కప్‌లో చోటు దక్కలేదు. మిచెల్ మార్ష్ సారథ్యంలో 15 మంది క్రికెటర్లతో కూడిన జట్టును ఎంపిక చేశారు. మిచెల్ మార్ష్ కెప్టెన్‌గా ఈ టీంకు సారథ్యం వహించనుండగా.. డేవిడ్ వార్నర్‌తో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు.
అయితే బిగ్ బాష్ లీగ్‌తో పాటు.. ఐపీఎల్‌లో జేమ్స్ ఫ్రేజర్ మెక్ గుర్క్ సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. పేసర్లు, స్పిన్నర్లు అనే తేడా లేకుండా అందరు బౌలర్లపై ఎదురు దాడి చేశాడు. ఐపీఎల్‌లో 9 మ్యాచుల్లో 330 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.
జేమ్స్ బ్యాటింగ్‌కు వచ్చిన తర్వాతనే ఢిల్లీ గెలుపు బాట పట్టింది. ఢిల్లీకి నెట్‌రన్ రేట్ కలిసి రాక 6 స్థానంతో సరిపెట్టుకుంది. ఇంత భీకర ప్లేయర్‌ను కచ్చితంగా జట్టుతో పాటు ఉంచాలని ఆసీస్ కోచ్ అండ్రూ మెక్ డొనాల్డ్ నిర్ణయం తీసుకున్నాడు. కానీ అప్పటికే 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేశారు. ఆసీస్ బోర్డుతో మాట్లాడి తుది జట్టులో కాకుండా.. ఎక్స్ ట్రా ప్లేయర్‌గా సెలెక్ట్ చేయించాడు. అవసరమైతే జేమ్స్‌ను బరిలో దించేందుకు ప్లాన్ వేశాడు.
జేమ్స్ ఫ్రేజర్ మెక్ గుర్క్, మథ్యూ షార్ట్‌ను ఆసీస్ ఎక్స్‌ట్రా ప్లేయర్లుగా సెలెక్ట్ చేసింది. జేమ్స్ ఫ్రేజర్‌ను టీ 20 వరల్డ్ కప్‌నకు సెలెక్ట్ చేయకపోవడంపై ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ నిరసన వ్యక్తం చేశాడు. ఆసీస్ క్రికెట్ బోర్డు తీరు అంతుబట్టడం లేదని విమర్శించాడు.