SRH: ఎనిమిది సంవత్సరాల తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2024లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన ఎలిమినేటర్ -2 మ్యాచులో సన్ రైజర్స్ ఆటగాళ్లు సమష్టిగా రాణించడంతో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసి ఫైనల్‌లో అడుగుపెట్టింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. రాహుల్ త్రిపాఠి 15 బంతుల్లోనే 37 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రాహుల్ త్రిపాఠి, మార్కమ్ రెండు పరుగుల తేడాతో అవుట్ కావడంతో 54 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. ట్రావిస్ హెడ్, క్లాసెన్ ఇద్దరూ సమయోచిత ఇన్సింగ్స్‌తో ఆకట్టుకున్నారు.
రాజస్థాన్ బ్యాట్స్‌మెన్‌ను తొందరగా ఔట్ చేసి సన్ రైజర్స్ విజయం ఖాయం చేసుకుంది. ఈ విజయం వెనక ఎన్నో ఏళ్ల శ్రమ ఉంది. డేవిడ్ వార్నర్ టీం నుంచి బయటకు వెళ్లిన తర్వాత టీంలో ఒక లోపం కనిపించింది. కానీ ఈ సారి టీం ఓనర్ కావ్యమారన్ తన సత్తా ఏంటో నిరూపించింది. కమిన్స్‌ను రూ.20.50 కోట్లతో కొనుగోలు చేసి అందరూ ముక్కన వేలేసుకునేలా చేసింది. ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్ అందించిన కమిన్స్ మొదటి సారి సన్ రైజర్స్‌కు సారథ్యం వహిస్తున్నాడు.
టీంను అన్ని రంగాల్లో ముందుండి నడిపిస్తున్నాడు. అటు వికెట్లు తీస్తూ.. ఇటు బ్యాటింగ్‌లోనూ విలువైన పరుగులు చేస్తూ జట్టును ఆపద సమయాల్లో ఆదుకుంటున్నాడు. కావ్య తీసుకున్న మరో నిర్ణయం ట్రావిస్ హెడ్‌ను సెలెక్ట్ చేసుకోవడం.. ఈ సీజన్‌లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఇద్దరూ ప్రత్యర్థి జట్ల బౌలర్లపై విరుచుకుపడి మరీ పరుగులు రాబడుతున్నారు. దీనికి తోడు క్లాసెన్ మిడిలార్డర్‌లో మంచి పర్ఫామెన్స్‌తో జట్టుకు విజయాలు చేకూర్చుతున్నారు. దీంతో కావ్య ప్లాన్ సక్సెస్ కావడంతో సన్ రైజర్స్ విజయం సాధించింది.