Cannes 2024: భారతీయ నటి అనసూయ సేన్‌గుప్తా రికార్డు సృష్టించారు. కేన్స్ 77వ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటిగా అవార్డు స్వీకరించారు. అన్ సర్టెయిన్ రిగార్డ్ విభాగంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి భారతీయ నటి అనుసూయ కావడం గమనార్హం. సేన్‌గుప్తా ముంబైలో ప్రొడక్షన్ డిజైనర్‌గా రాణించారు. ఇప్పుడు గోవాలో స్థిరపడ్డారు.
బల్గేరియన్ దర్శకుడు కాన్‌స్టాంటివ్ బోజనోవ్ తీసిన ది షేమ్‌లెస్‌లో నటించారు. ఈ చిత్రంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు అవార్డు వరించింది. ఈ సినిమాలో మితా వశిస్ట్ సైతం నటించారు.
షేమ్‌లెస్‌లో అనసూయ సేన్‌గుప్తా సెక్స్ వర్కర్‌గా నటించారు. మర్డర్ కేసులో ఇరుక్కొని ఢిల్లీ నుంచి పారిపోయి సెక్స్ వర్కర్‌గా ఆశ్రయం పొందిన రేణుకగా ఆమె ఈ చిత్రంలో నటించి మెప్పించారు. ఒమారా శెట్టి పోషించిన దేవిక అనే యువకుడితో రేణుక అక్రమ ప్రేమ వ్యవహారం ఈ సినిమా ఇతివృత్తంగా సాగుతుంది. తన శారీరక అనారోగ్యాలతో సెక్స్ వర్క్‌లోకి దిగకుండా రక్షింపడుతుంది. అనంతరం అనేక కఠిన పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ సినిమా చిత్రీకరణ ఇండియాతోపాటు నేపాల్‌లో 45 రోజులపాటు సాగింది.
ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న అనసూయ మాట్లాడుతూ.. తన అవార్డును క్వీర్ కమ్యూనిటీ, ఇతర నిమ్న వర్గాల వారికి అంకితమిస్తున్నట్లు తెలిపారు. అవార్డు అందుకున్న సమయంలో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. గద్గద స్వరంతో.. వణుకుతున్న చేతులతో అవార్డు అందుకున్న ఆమె కళ్లు చమర్చాయి.