Nayanthara: ఈ ఏడాది ఆరంభంలో ‘భ్రమయుగం’తో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఆకట్టుకున్నారు. ఆ చిత్రంతో మరోసారి తనను తాను సరికొత్తగా చూపించారు. ఆ తర్వాత ‘టర్బో’ చిత్రంతో హిట్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం మరో మూడు మలయాళ చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మలయాళంలో ఆయన దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. ముమ్ముట్టి నిర్మాణంలో తెరకెక్కుతోంది ఈ మూవీ. ఇటీవల ఈ చిత్రం షూటింగ్కు శ్రీకారం చుట్టారు. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తుండగా, మమ్ముట్టితో ఆమె నటిస్తున్న మూడో చిత్రమిది. గౌతమ్ మీనన్ ఎంచుకునే కథలు డిఫరెంట్గా ఉంటాయి. ప్రేమకథలు తెరకెక్కించడంలో మాస్టర్ అయిన మీనన్ ఈసారి ఎలాంటి కథ ఎంచుకున్నారన్ని ఆసక్తి నెలకొంది. నయన, మమ్ముట్టి జంట తెరపై ఎలా కనిపిస్తారో అనే అంశంపై కుతూహలం పెంచుతోంది. అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ల వివాహానికి నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతులు కలిసి హాజరయ్యారు. అక్కడ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు నయన్. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. నయన్ చేతిలో తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పది వరకు చిత్రాలున్నాయి.