70Th National Film Awards: జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. 2022 డిసెంబర్31 లోపు విడుదలైన చిత్రాలను పరిగణలోకి తీసుకొని అవార్డులను అనౌన్స్ చేశారు. మలయాళం, కన్నడ, తమిళ సినిమాలు అవార్డులు ఎక్కువగా కొల్లగొట్టాయి. జాతీయ ఉత్తమ చిత్రంగా ఆట్టమ్ నిలిచింది. ఉత్తమ నటుడుగా కాంతార రిషబ్ శెట్టి (కాంతార), ఉత్తమ హీరోయిన్లుగా నిత్యామీనన్ (తిరుచిత్రాంబళం), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్‌ప్రెస్) నిలిచారు. హీరో నిఖిల్ నటించిన కార్తికేయ-2 ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది.
ఉత్తమ నటుడు : రిషబఖ శెట్టి (కాంతార)
ఉత్తమ నటి : నిత్యా మీనన్ (తిరు చిత్రాంబలం), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్‌ప్రెస్)
ఉత్తమ సహాయ నటుడు : పవన్ రాజ్ మల్హోత్రా (ఒరియా)
ఉత్తమ సహాయ నటి : నీనా గుప్తా (ఉంచాయి)
ఉత్తమ దర్శకుడు : సూరజ్ బర్జాత్యా (ఉంచాయి)
బెస్ట్ పాపులర్ ఫిల్మ్ : కాంతార (కన్నడ)
బెస్ట్ సినిమాటోగ్రఫీ : రవివర్మన్ (పొన్నియన్ సెల్వన్ -1)
బెస్ట్ మ్యూజీషియన్ : శివ, ప్రీతమ్ (బ్రహ్మాస్త్ర)
బెస్ట్ రీ రికార్డింగ్ : ఏఆర్ రెహమాన్ (పొన్నియన్ సెల్వన్ 1)
బెస్ట్ కొరియోగ్రాఫర్స్ : జానీ మాస్టర్, సతీశ్ కృష్ణన్ (తిరుచిత్రాంబలం)
బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ : అన్బరివు (కేజీఎఫ్)
ఉత్తమ ప్రాంతీయ చిత్రం : తెలుగు – కార్తికేయ 2
ఉత్తమ ప్రాంతీయ చిత్రం : తమిళ్- పొన్నియన్ సెల్వన్ -1
ఉత్తమ ప్రాంతీయ చిత్రం : కన్నడ – కేజీఎఫ్-2
ఉత్తమ ప్రాంతీయ చిత్రం : మళయాలం- సౌదీ వెళ్లక్క
ఉత్తమ ప్రాంతీయ చిత్రం : ఒరియా – ధమన్
ఉత్తమ ప్రాంతీయ చిత్రం : మరాఠీ – వాల్వీ
ఉత్తమ ప్రాంతీయ చిత్రం : హిందీ – గుల్ మొహర్
ఉత్తమ ప్రాంతీయ చిత్రం : బెంగాలీ – కబేరీ అంతర్దాన్
ఉత్తమ ప్రాంతీయ చిత్రం : పంజాబీ – బాగీ డీ దీ