Shiva rajKumar New Movie: కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ‘హ్యాట్రిక్ హీరో’గా పేరున్న శివరాజ్ కుమార్ దక్షిణాదిన ఉన్న బిజియస్ట్ యాక్టర్లలో ఒకరు. లీడ్ రోల్స్ తో పాటు, ‘జైలర్’, ‘కెప్టెన్ మిల్లర్’ వంటి ప్రముఖ చిత్రాలలో ప్రత్యేక పాత్రలు చేయడంతో పాపులర్ అయ్యారు. అయితే, శివ రాజ్‌కుమార్ నెక్స్ట్ మూవీని అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది చిత్ర నిర్మాణ సంస్థ. ఈ కన్నడ తెలుగు బైలింగ్వల్ ఫిల్మ్‌ని కార్తీక్ అద్వైత్ దర్శకత్వంలో పద్మజ ఫిలింస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో భువనేశ్వరి పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఎన్ రెడ్డి, సుధీర్ పి నిర్మిస్తున్నారు. మేకర్స్ కొత్తగా విడుదల చేసిన పోస్టర్ ద్వారా ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న ఎక్సయిట్మెంట్‌ని పెంచారు.
డైరెక్టర్ కార్తీక్ అద్వైత్ గతంలో విక్రమ్ ప్రభుతో ‘పాయుమ్ ఒలి నీ యెనక్కు’ తమిళ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ ప్రాజెక్ట్‌తో శాండల్‌వుడ్‌లోకి అడుగుపెట్టారు. ఇది అతని సెకెండ్ డైరెక్షనల్ వెంచర్. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా, మ్యూజిక్ కంపోజిషన్ జరుగుతోంది. షూట్‌ను ఫార్మల్‌గా కిక్ స్టార్ట్ చేశామని, అఫీషియల్ లాంచ్ వేడుక ఆగస్టులో ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. మిగిలిన ప్రధాన పాత్రల కోసం నటీనటుల ఎంపిక ఖరారైందని, శివరాజ్ కుమార్ నటనకు అనుగుణంగా ట్యాలెంటెడ్ స్టార్ కాస్ట్ ఉంటుందని మేకర్స్ చెప్పారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రానికి సామ్ సి.ఎస్ సంగీతం సమకూరుస్తున్నారు. ఎ.జె శెట్టి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.