Mr Bachchan in Kashmir: స్టార్ హీరో రవితేజ, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘మిస్టర్ బచ్చన్’. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఇందులో భాగంగా టీం సాంగ్ షూట్ కోసం కాశ్మీర్ వ్యాలీ వెళ్లిన చిత్రబృందం ప్రస్తుతం అక్కడ పాట చిత్రీకరణలో బిజీగా ఉంది.
తాజా షెడ్యూల్‌లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సేపై ఓ మెలోడీ డ్యూయెట్‌ను షూట్ చేస్తున్నారు. ఈ పాటకు స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. కాశ్మీర్‌లోని అందమైన లొకేషన్‌లో ఈ పాట చిత్రీకరణ నాలుగు రోజులుగా కొనసాగుతుండగా, ఆదివారం పూర్తయింది. మూవీ 90 శాతం చిత్రీకరణ పూర్తి కావడంతో, మిగిలిన పార్ట్స్‌ని చిత్రీకరించే దిశగా టీమ్ శరవేగంగా పని చేస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె మేయర్, కెమెరా: అయనంక బోస్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల.