Mister X
Mister X

Mister X: ‘మిస్టర్ X’ షూటింగ్ పూర్తి

Mister X: స్టార్ హీరోలు ఆర్య, గౌతమ్ కార్తీక్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ X’. మను ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీలో సీనియర్ నటుడు శరత్ కుమార్, నటి మంజు వారియర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రిన్స్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.లక్ష్మణ్‌ కుమార్‌ నిర్మాణంలో హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. షూటింగ్ చివరి రోజును మూవీ టీమ్ అంతా కలిసి సెలబ్రేట్ చేసుకుంది.

‘మిస్టర్ X’లోని యాక్షన్ సన్నివేశాల్ని భారతదేశంతోపాటు ఉగాండా, అజర్‌బైజాన్, జార్జియా దేశాల్లో చిత్రీకరించామని మేకర్స్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ) భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాలో స్టంట్ సిల్వా యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తుండగా.. ‘మరగధ నానయం’, ‘బ్యాచిలర్’, ‘కనా’ ‘నెంజుకు నీది’ సినిమాల ఫేమ్ ధిబు నినాన్ థామస్ సంగీతం సమకూరుస్తున్నారు. సినిమాటోగ్రఫీ: తన్వీర్ మీర్; సహ నిర్మాత: ఎ.వెంకటేశ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *