Allari Naresh Bachhala Malli: హీరో అల్లరి నరేశ్ తన పుట్టినరోజును పురస్కరించుకొని కొత్త మూవీకి సంబంధించిన అప్డేట్స్ అందించారు. కొత్తగా తెరకెక్కుతున్న ‘బచ్చల మల్లి’ మూవీకి సంబంధించిన హీరో ఇంటెన్స్ క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ ప్రత్యేక గ్లింప్స్ విడుదల చేశారు. సోలోబతుకే సో బెటర్, సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సుబ్బు మంగదేవి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. బాలాజీ గుత్తా సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
‘‘హీరో ఇంట్లో పడుకొని ఉంటాడు. సమీపంలో లౌడ్ స్పీకర్‌లో బిగ్గరగా భగవద్గీత వినిపిస్తుంది. దీంతో హీరో నిద్రకు భంగం కలుగుతుంది.’’ ఇందుకు సంబంధించి గ్లింప్స్ విడుదల చేశారు. అలాగే స్థానికంగా ఉండే బార్‌లో స్టైల్‌గా మద్యం సేవించి, అక్కడ గూండాలతో ఫైట్ చేసిన సీన్ సినిమా హై ఎక్స్‌పెక్టేషన్స్‌ను పెంచేసింది. ‘ఏయ్ ఎవడి కోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి’ అన్న మాస్ డైలాగ్ పవర్ ఫుల్‌గా చెప్పడం క్యారెక్టరైజేషన్‌ను ఎలివేట్ చేస్తుంది. ఈ సినిమా పూర్తిగా మాస్ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది. గతంలో నరేశ్ పూర్తి మాస్ క్యారెక్టర్‌తో మూవీ చేయలేదు. ఇంత వరకు చూడని అల్లరి నరేశ్‌ను మనం ఈ మూవీలో చూడబోతున్నామని తెలుస్తోంది. ఈ క్యారెక్టర్ కోసం నరేశ్ చాలానే కష్టపడ్డట్లు అర్థమవుతోంది. మునుపెన్నడూ మనకు కనిపించని నరేశ్ ఈ సినిమాలో కనిపించబోతున్నారన్నమాట. ఇది నిజంగానే నరేశ్‌కు, ఆయన ఫ్యాన్స్‌కకు శుభవార్తే అవుతుంది.
ఈ సినిమాలో అల్లరి నరేశ్ సరసన అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో రోహిణి, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, రావు రమేశ్, ప్రవీణ్, వైవా హర్ష, హరితేజ వంటి వారు ముఖ్యపాత్రలు పోషించారు.
భారీ స్థాయిలో తీస్తున్న ఈ మూవీకి టాప్ టెక్నిషియన్లు వర్క్ చేస్తున్నారు. ‘సీతారామం’ మూవీకి సంగీతం అందించిన విశాల్ చంద్రశేఖర్ స్వరాలు సమకూర్చారు. మానాడు, మట్టికుస్తి, రంగం తదితర చిత్రాలకు పనిచేసిన రిచర్డ్ ఎం నాథన్ ఈ మూవీకి డీవోపీగా పనిచేస్తున్నారు. ఛోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తుండగా, బ్రహ్మ కడలి ప్రొక్షన్ డిజైనర్‌గా పనిచేస్తోంది.
ఈ సినిమాకు కథ, సంభాషణలు సుబ్బు అందించారు. విప్పర్తి మధు స్ర్కీన్‌ప్లే, ఎడిషనల్ స్ర్కీన్ ప్లే విశ్వనేత్ర వ్యవహరించారు.
‘బచల్ల మల్లి’ని సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
తారాగణం: అల్లరి నరేశ్, అమృత అయ్యర్, రోహిణి, రావు రమేశ్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష
సాంకేతిక సిబ్బంది:
కథ, మాటలు, దర్శకత్వం : సుబ్బు మంగదేవి
నిర్మాతలు: రాజేశ్ దండా, బాలాజీ గుత్తా
బ్యానర్: హాస్య మూవీస్
స్క్రీన్ ప్లే: విప్పర్తి మధు
ఎడిషనల్ స్క్రీన్ ప్లే: విశ్వనేత్ర
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
డీవోపీ: రిచర్డ్ ఎం నాథన్
ఎడిటింగ్: ఛోటా కె ప్రసాద్
ప్రొడక్షన్ డిజైన్: బ్రహ్మ కడలి
మార్కెటింగ్:ఫస్ట్ షో