అర్హులు ఎవరు? ఎప్పటి నుంచి అమలు?
Mahalakshmi Scheme: తెలంగాణ ప్రభుత్వం ‘మహాలక్ష్మి’ స్కీమ్‌ను అమలు చేసేందుకు కార్యాచరణను రూపొందించింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీల్లో భాగంగా దీన్ని అమలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ర్టంలోని ప్రతి మహిళ బ్యాంకు అకౌంట్‌లో ప్రతి నెలా రూ.2500 ప్రభుత్వం జమ చేయనున్నది. జూలై నెల నుంచి దీన్ని అమలు చేసేందుక కసరత్తు చేస్తున్నారు.
పథకాన్నిఎప్పటి నుంచి అమలు చేస్తారు?
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ‘మహాలక్ష్మి’ పథకాన్ని అమలుకు రూపకల్పన చేస్తోంది. పథకానికి సంబంధించిన విధి విధానాలు, అర్హుల ఎంపిక తదితర ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి. అధికారులు మాత్రం ఈ పథకాన్ని జూలై నుంచి అమలు చేయొచ్చని అంటున్నారు. ఈ పథకం అమలైతే రాష్ర్టంలోని ప్రతి మహిళ బ్యాంకు ఖాతాలో రూ.2500 ప్రతి నెలా జమ చేస్తారు.
మార్గదర్శకాలు ఏమైనా ఉన్నాయా?
ఈ పథకం ప్రారంభానికి సంబంధించి స్నాహాలు చేస్తున్నట్లు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ ఇటీవల వెల్లడించారు. పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు సైతం రెడీ అయ్యాయని తెలిసింది. పథకం ప్రారంభించడమే ఆలస్యమని అధికారిక వర్గాల సమాచారం. ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందాలనుకునే వారికి కొన్ని షరతులు విధించారు.
ఎవరు అర్హులు?
- దరఖాస్తుదారు తప్పనిసరిగా తెలంగాణవాసియై ఉండాలి.
- మహిళ కుటుంబానికి యజమాని అయి ఉండాలి.
- దారిద్రరేఖకు దిగువన ఉన్న కుటుంబానికి చెందినవారై ఉండాలి.
- దరఖాస్తు చేసుకునే మహిళకు తప్పనిసరిగా వివాహమై ఉండాలి.
- ఒక కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
- మహిళ కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ.2 లక్షలకు మించరాదు.
- ఈ పథకానికి ముఖ్యంగా తెల్లరేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోనున్నారు.
సందేహాలు – సమాధానాలు
- ఏ వయస్సు వారు అర్హులు?
వయస్సుతో నిమిత్తం లేదు. మహిళకు వివాహమై ఉండాలి - ఇంట్లోని మహిళలు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చా?
కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే పథకం వర్తిస్తుంది. ఆమె కుటుంబ యజమానికి అయి ఉండాలి. - వివాహమై విడిగా ఉంటున్నవారు అర్హులా?
అర్హులే - కొత్తగా బ్యాంకు ఖాతా తెరవాలా?
అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న బ్యాంకు ఖాతాను దరఖాస్తుతో జత చేయొచ్చు. - రేషన్ కార్డులేని మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చా?
పథకం ద్వారా లబ్ధిపొందాలంటే తెల్లరేషన్ కార్డు తప్పనిసరి. లేకుంటే పథకం ప్రయోజనం పొందలేరు. - దరఖాస్తులు ఎక్కడ సమర్పించాలి?
ప్రజాపాలన కార్యక్రమంలో సమర్పించాలి