Sevalal Premier League: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 9 (మన బలగం): ఫిబ్రవరి15న జరగనున్న సద్గురు శ్రీ సేవాలాల్ మహారాజ్ 286 జయంతిని పురస్కరించుకొని సేవాలాల్ ప్రీమియం లీగ్ సీజన్- 2ను ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చిన్న బోనాల్లో గల గ్రౌండ్‌లో గోర్ బంజారా నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా భూక్య రవికుమార్, అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్ర గోర్ సిక్వాడి సంయోజక్ రాములు నాయక్ మాట్లాడుతూ, గోర్ సాంప్రదాయాలను అందరూ గోర్ బోలిని గోరు విధానాన్ని యువత ముందుండి ముందుకు తీసుకువెళ్లాలని గోర్ యువకులు మంచి క్రమశిక్షణతో ఆడి అందరి మనసును గెలుచుకోవాలని అన్నారు. సేవాలాల్ 286 జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ భూక్య గజాన్ లాల్ నాయక్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, యువత పెడదారి పట్టకుండా, మత్తు, డ్రగ్స్‌కు అలవాటు పడకుండా సేవాలాల్ చూపించిన సన్మార్గంలో నడుచుకోవాలని, యువత సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని అన్నారు. గుగులోత్ సురేశ్ నాయక్ మాట్లాడుతూ 15న జరగబోయే సేవలాల్ జయంతిలో గోర్ యువకులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు, మేనేజ్మెంట్ నిర్వాహకులు రవి నాయక్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని బంజారా గ్రామాల నుంచి 30 జట్లు 5 రోజులపాటు ఆడనున్నాయని, అన్ని జట్ల కెప్టెన్లు సహకరించి విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మోతిలాల్ నాయక్, రాజునాయక్, గోపీనాయక్ దేవ్ సింగ్ నాయక్, రాందాస్ నాయక్, సేవ్య నాయక్, నరేష్ నాయక్, భాస్కర్ నాయక్, హజునాయక్, ప్రదీప్, మహేందర్, సాగర్, అఖిల్, మధు చిన్న శేఖర్ తదితరులు పాల్గొన్నారు.