Double iSmart: రామ్‌పోతినేని, సంజయ్ దత్, పూరిజగన్నాథ్, చార్మికౌర్, పూరి కనెక్ట్స్ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘డబుల్ ఇస్మార్ట్’ ఫస్ట్ సింగిల్ స్టెప్పా మార్ జూలై 1న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘డబుల్ ఇస్మార్ట్’తో మరో సారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని పూరిజగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీని ఆస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నది.
శివుడి విగ్రహం ముందు రామ్ పోతినేని కంప్లీట్ స్టైలిష్ వైబ్‌లో డ్యాన్స్ చేస్తున్న పోస్టర్‌ను రిలీజ్ చేయగా, ప్రస్తుతం నెట్టింట్ హల్ చల్ చేస్తోంది. ఈ సాంగ్ ఎలక్ర్టిఫయింగ్ ట్యూన్‌గా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. రామ్ డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. జానీ మాస్టర్ కొరియో గ్రఫీ చేయగా, భాస్కరభట్ల లిరిక్స్ అందించారు. అనురాగ్ కులకర్ణి వోకల్స్ జత చేశారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొంది ఈ మూవీలో సంజయ్ దత్ మెయిన్ విలన్‌గా నటించారు. కావ్య థాపర్ ఫిమేల్ లీడ్ రోల్ పోషించారు. డబుల్ ఇస్మార్ట్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.
నటీనటులు: రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య థాపర్, అలీ, గెటప్ శ్రీను, తదితరులు.
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: పూరి జగన్నాథ్
నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్
బ్యానర్: పూరి కనెక్ట్స్
సీఈవో: విష్
సంగీతం: మణి శర్మ
సినిమాటోగ్రఫీ: సామ్ కె.నాయుడు, జియాని జియాన్నెలి
స్టంట్ డైరెక్టర్: కేచ, రియల్ సతీశ్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా