LIC Saral Pension Plan: ఎల్ఐసీ రూ.1 లక్ష వరకు పెన్షన్‌ను వర్తింపజేసే ప్లాన్ వివరాలు తెలుసుకోండి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కొత్తగా ఏ ప్లాన్ ప్రారంభించినా అది విజయవంతంగా అమలవుతుంది. ఎందుకంటే అది ప్రజల్లో ఎల్ఐసీపై ఉన్న ఆదరణ, నమ్మకమే కారణమని చెప్పాలి. ఎల్ఐసీ వివిధ రకాల ప్లాన్లు అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తోంది. తక్కువ చెల్లింపులతో అధిక లాభాలు ఆర్జించే పథకాలు సైతం ఉన్నాయి. వాటిని మనం ఎంచుకోవడంపైనే ఆధారపడి ఉంటుంది. ఎల్ఐసీలో పెట్టుబడులు పెడితే ఎలాంటి రస్క్ ఉండదు. ప్రతి పైసాకూ గ్యారెంటీ ఉంటుంది. ఇప్పటికే అనేక స్కీమ్స్ అమలు చేస్తున్నది. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో అవసరమైన పథకాలు వర్తింపజేస్తున్నది. లైఫ్ ఇన్సూరెన్స్‌తోపాటు అనేక రకాల పథకాలు అమలు చేస్తున్నది.
ఒకేసారి పెద్ద మొత్తంలో పెన్షన్ పొందాలనుకునేవారికి ఎల్ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్ దోహదపడుతుంది. 2022 ఆగస్టు నుంచి ఈ ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్లాన్ ఇన్‌స్టంట్ యాన్యుటీ ప్లాన్. ప్రారంభం నుంచి 5 శాతం యాన్యుటీ హామీ అందిస్తుంది. ఈ ప్లాన్ నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ ఆఫ్ ఫ్రంట్ సింగల్ ప్రీమియంగా కొనసాగుతున్నది. నెల వారీ, త్రైమాసిక, అర్ధవార్షిక, వార్షిక వాయిదాల్లో చెల్లింపులు అందుకోవచ్చు. 40 నుంచి 80 ఏళ్ల మధ్య వయస్సు గల వారు ఈ ప్లాన్‌కు అర్హులు.
ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాలు ఇలా ఉన్నాయి. సరళ్ పెన్షన్ ప్లాన్‌లో నెలకు కనీసం రూ.వెయ్యి లేదా ఏడాదికి రూ.12000 పొందవచ్చు. కనీస పెన్షన్ పొందేందుకు రూ.2.50 లక్షలు సింగిల్ ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. రూ.10 లక్షలు సింగిల్ ప్రీమియంగా చెల్లిస్తే ఏడాదికి రూ.50,250 పెన్షన్ అందిస్తారు. రూ.20 లక్షలు ప్రీమియంగా చెల్లి్స్తే రూ.ఒక లక్ష వార్షిక పెన్షన్ పొందవచ్చు.
ఈ ప్లాన్ ప్రారంభించిన ఆరు నెలల తరువాత లోన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. ఆరు నెలల తరువాత ఈ ప్లాన్ నుంచి పూర్తిగా తప్పునే సౌలభ్యం సైతం ఉంది. 5 శాతం వార్షిక రాబడికి ఈ ప్లాన్ హామీ కల్పిస్తుంది. ఇది జీవిత పాలసీ. స్టార్ట్ చేసిన అనంతరం జీవితాంతం ప్రతి నెలా లేదా ఏడాదికి ఒక సారి పెన్షన్ అందుతుంది. పాలసీదారు మరణిస్తే బేస్ ప్రీమియం నామినీకి చెల్లిస్తారు.