- మధ్యతరగతికి భారీ ఊరట
- వచ్చే వారం కొత్త ఐటీ చట్టం
- తగ్గనున్న మొబైల్, టీవీల ధరలు
- పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్
- గంట 15 నిమిషాలు సాగిన ప్రసంగం
- సోమవారానికి సభ వాయిదా
Budget 2025: తెలంగాణ బ్యూరో/ మన బలగం: 2025-26 సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రవేశపెట్టారు. అందరూ ఊహించినదానికి మించి పన్నుపై మధ్యతరగతికి భారీ ఊరట కల్పించారు. రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు కల్పించారు. మొబైల్ ఫోన్లు, ఎల్ఈడీ, ఎల్‌సీడీ టీవీలు, లెదర్ ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి.
– అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త హంగులు
– బిహార్‌లో మఖానా రైతుల కోసం ప్రత్యేక బోర్డు
-పోస్టల్ రంగానికి కొత్త జవసత్వాలు
– ఎంఎస్ఎంఈలకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత
– ఎంఎస్ఎంఈలకు రూ.10 కోట్ల వరకు రుణాలు
-స్టార్టప్‌ల కోసం రూ.20 కోట్ల వరకు రుణాలు
-ఏఐ రంగంలో సీఓఈ
– గడిచిన పదేళ్లలో కొత్తగా 1.01 లక్షల వైద్య సీట్ల పెంపు
-రానున్న ఐదేళ్లలో కొత్తగా 75 వేల మెడికల్ సీట్లు
– వచ్చే ఏడాది అదనంగా10 వేల మెడికల్ సీట్లు
– అన్ని జిల్లా ఆస్పత్రుల్లో డే-కేర్ క్యాన్సర్ సెంటర్లు
-2025-26లోనే 200 క్యాన్సర్ సెంటర్ల ఏర్పాటుల
– పట్టణ పేదలు, వర్తకులకు చేయూత
– వర్తకులకు రూ.30వేల పరిమితితో యూపీఐ క్రెడిట్ కార్డులు
-గిగ్ వర్కర్లకు ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా ఐడెంటిటీ కార్డులు
– గిగ్ వర్కర్లకు ఆరోగ్య పథకం
-కోటి మంది గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా
-3వ ప్రాధాన్యత రంగంగాపెట్టుబడులు
– ప్రభుత్వ పెట్టుబడులు పెంపు
– ప్రభుత్వ స్కూళ్లలో 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్
– అన్ని ప్రభుత్వ హైస్కూల్స్‌కు బ్రాడ్‌బ్యాండ్ సేవలు
-భారతీయ భాష పుస్తకాలకు డిజిటల్ రూపం
– స్కూల్స్‌లో విద్యతోపాటు నైపుణ్య శిక్షణ
-2014 తర్వాత ఏర్పాటైన 5 ఐఐటీలకు మరిన్ని నిధులు, ఆధునీకరణ
– 3వ ప్రాధాన్యత రంగంగా పెట్టుబడులు
– ప్రభుత్వ పెట్టుబడులు పెంపు
– స్టార్టప్‌ల కోసం రూ.20 కోట్ల వరకు రుణాలు
– 27 కీలక రంగాలకు ప్రాధాన్యత
– పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం
– కంది, మినుములు, మసూర్ పప్పు కొనుగోలుకు నిర్ణయం
– పండ్లు కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకం
– తోలు పరిశ్రమలు, బొమ్మల రంగానికి చేయూత
– కొత్తగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్
– మేకిన్ ఇండియా కోసం జాతీయ స్థాయి ప్రణాళిక
– ఆరు రంగాల్లో సమూల మార్పులు
– పీఎం ధన్ ధాన్య కృషి యోజన పేరుతో కొత్త పథకం
– 17 కోట్ల మంది రైతులకు ప్రయోజనం
– కిసాన్ క్రెడిట్ రుణాలు పెంపు
– సంస్కరణలు చేసే రాష్ట్రాలకు అదనపు నిధులు
– మూలధన వ్యయానికి వడ్డీ లేకుండా రూ.1.50 లక్షల కోట్లు
– విద్యుత్ రంగంలో సంస్కరణలు
– అంతర్రాష్ట్ర విద్యుత్ పంపిణీ కోసం కొత్త ప్రణాళిక
– వికసిత్ భారత్ కోసం న్యూక్లియర్ ఎనర్జీ మిషన్
– అణుశక్తి చట్టానికి సవరణలు, ప్రైవేటు రంగానికి అవకాశం
– 2033 నాటికి ఐదు స్వదేశీ రియాక్టర్ల నిర్మాణం
– 2028 వరకు జల్ జీవన్ మిషన్ పథకం పొడిగింపు
– జల్ జీవన్ మిషన్ ద్వారా దేశంలోని ఇంటింటికీ తాగునీరు
– నగరాల అభివృద్ధికి అర్బన్ చాలెంజ్ ఫండ్
– పీఎం స్వనిధి పథకం కింద రుణాల పెంపు
– పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా
– కొత్త పథకాల అమలుకు రూ.10 లక్షల కోట్లు
– కొత్తగా 117 ప్రాంతాలకు విమాన సర్వీసులు
– కొత్తగా ఉడాన్ పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం
– బిహార్‌లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల ఏర్పాటు
– బిహార్ మిథిలాంచల్ ప్రాంతంలో కొత్తగా రేవు ఏర్పాటు
– దేశంలోని 50 ప్రముఖ పర్యాట కేంద్రాల్లో ప్రత్యేక అభివృద్ధి
– యువత కోసం నైపుణ్య శిక్షణ కోసం ప్రత్యేక కేంద్రాలు
– పర్యాటక ప్రదేశాలకు మెరుగైన రవాణా సదుపాయాలు
– కొన్ని రకాల విదేశీ పర్యాటకులకు వీసీ మినహాయింపు
– ప్రైవేటురంగం తోడ్పాటుతో మెడిల్ టూరిజం
– మెడికల్ టూరిజానికి వచ్చే వారికి వీసీ మంజూరులో మినహాయింపులు, సరళీకృత విధానాల అమలు
– పట్టణాభివృద్ధికి రూ.లక్షల కోట్లు
– రాష్ట్రాల రుణాల పరిమితి జీఎస్‌డీపీలో 0.5 శాతం పెంపు
– మధ్య తరగతి ప్రజల కోసం 40 వేల ఇళ్లు
– ఉపాధికల్పన దిశగా పర్యాటక రంగం
– పదేళ్లలో 120 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల ఏర్పాటు
– మైనింగ్ రంగంలో సంస్కరణలు
– రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు
– ఐఐటీ, ఐఐఎస్‌సీలో కొత్తగా 10 వేల ఫెలోషిప్స్
– కొత్త తరహా స్టార్టప్స్ కోసం మరింత తోడ్పాటు
-పురాతన రాతప్రతుల సర్వే, డాక్యుమెంటేషన్ కోసం జ్ఞానభారతం
– ఒక కోటి పురాతన రాతప్రతుల డిజిటలైజేషన్
– ఎగుమతులు లక్ష్యంగా దేశీయ తయారీ రంగానికి మరింత చేయూత
– యువతకు తోడ్పాటు అందించే దేశీయ ఎలక్ర్టానిక్ రంగానికి చేయూత
– ఎగుమతులకోసం కొత్త విధానం.. న్యూ ఎక్స్‌పోర్ట్ మిషన్
– బీమా రంగంలో ఎఫ్‌డీఐ 100 శాతానికి పెంపు
– వచ్చే వారం కొత్త ఆదాయ పన్ను బిల్లు
– కంపెనీల విలీన ప్రక్రియ మరింత హెతుబద్ధం
– రాష్ట్రాల మధ్య పోటీతత్వం పెంచేందుకు కొత్తగా ఇండెక్స్ ఆఫ్ స్టేట్స్
– వివధ చట్టాల్లోని లొసుగులు తొలగించేందుకు కొత్త చట్టం
– సంస్కరణలు అమలు చేసేందుకు ఉన్నతస్థాయి కమిటీ
– మూలధన వ్యయం కోసం రూ.10.148 లక్షల కోట్లు
– కస్టమ్ సుంకాల సరళీకరణ
– 7 రకాల కస్టమ్స్ సుంకాల తొలగింపు, ఇక 8 రేట్లు మాత్రమే
– ఒక సెస్ లేదా ఒక సర్ చార్జీ ఉండేలా సుంకం
– క్యాన్సర్, తీవ్రమైన వ్యాధుల ఔధాలకు పన్ను మినహాయింపు
– క్యాన్సర్ బల్క్ డ్రగ్ తయారీకి పన్ను వినహాయింపు
– 36 ఔధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగింపు
– సర్జికల్ పరికాల ధరలు తగ్గింపు
– తగ్గనున్న క్యాన్సర్, అరుదైన వ్యాధుల ఔషధాల ధరలు
– లిథియం బ్యాటరీలపై పన్ను తొలగింపు
– తగ్గనున్న ఎలక్ట్రిక్వా హనాల ధరలు
– తగ్గనున్న టీవీలు, మొబైల్, ఎలక్ట్రిక్వా హనాల ధరలు
– తగ్గనున్న లెదర్ ఉత్పత్తుల ధరలు
– తగ్గనున్న సముద్ర ఉత్పత్తుల ధరలు
– ఎల్‌సీడీ, ఎల్ఈడీ ఉత్పత్తులకు కేంద్రం ప్రోత్సాహం
– దేశవ్యాప్తంగా పెట్టుబడుల ఉపసంహరణ
– ఆస్తుల విక్రయానికి రెండో ప్రణాళిక
– రూ.25 వేల కోట్లతో నేషనల్ మారిటైమ్ ఫండ్ ఏర్పాటు
– ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మారిటైమ్ మిషన్
– వృద్ధి కేంద్రాలుగా పట్టణాల అభివృద్ధికి రూ.లక్ష కోట్లు
– మరింత సరళంగా కొత్త ఆదాయ పన్ను చట్టం
-నిబంధనలు, పదాలు దాదాపు 50 శాతం తగ్గింపు
-భారతీయ న్యాయ సంహిత చట్టం తరహాలో ఐటీ చట్టం
– మధ్యతరగతిని దృష్టిలో పెట్టుకొని ఆదాయ పన్ను
-టీడీఎస్, టీసీఎస్ రేట్ల తగ్గింపు
ఆదాయపన్ను శ్లాబులు
0-4 లక్షలు నిల్
4-8 లక్షల వరకు 5 శాతం
8-12 లక్షల వరకు 10 శాతం
12-16 లక్షల వరకు 15 శాతం
16-20 లక్షల వరకు 20 శాతం
20-24 లక్షల వరకు 25 శాతం
24 లక్షలకు పైగా 30 శాతం
– అద్దె ఆదాయంపై టీడీఎస్ 2.4 లక్షల నుంచి 6 లక్షలకు పెంపు
– 2-4 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆదాయ పన్ను వివాదాలకు విముక్తి
– సినియర్ సిటిజన్లకు టీడీఎస్, టీసీఎస్ మినహాయింపు మొత్తం రూ.1 లక్షకు
– జీడీపీలో ద్రవ్యలోటు 4.4 శాతం ఉండే అవకాశం
– రూ.12 లక్షలవరకు నో ట్యాక్స్
– ఒక్కసారిగా పడిపోయిన స్టాక్ మార్కెట్
– లాభాల నుంచి నష్టాల్లోకి మార్కెట్లు
– 330 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
– 90 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ