Thiru Nakshatra Pooja K hanapur 2025: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని శ్రీ గోదాశ్రీకృష్ణ మందిరంలో గురువారం శ్రీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అవతరించిన రోజు (పుట్టిన రోజు) శ్రావణ నక్షత్రం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వర్దిపర్తి వెంకటరమణ చార్యులు ఆధ్వర్యంలో వేద మంత్రాల మధ్య అభిషేక, అర్చనలు, విశేష పూజలు, అష్టోత్తరపూజలు చేశారు. ఆలయం గోవిందా నామస్మరణతో మారుమోగింది. భక్తులు తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకున్నారు.