- అప్రమత్తం అయిన అధికారులు
- నిండుగా ప్రవహిస్తున్న గోదావరి
Sudarmatt anicut shutters washed away in Godavari floods: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మేడంపెల్లి సమీపంలో గల సదర్మాట్ ఆనకట్టకు చెందిన ప్రధాన ఏడుమ కాలువ షటర్లు వరద తాకిడి (హెడ్ రెగ్యులేటర్ షటర్) రెండు కొట్టుకుపోయాయి. అందులో ఒకటి కొట్టుకుపోగా మరొకటి ఊడి పడిపోయింది. బుధవారం రాత్రి షటర్లు తెగి తెగిపోయాయి. దీనితో అప్రమత్తం అయిన సంబందించిన అధికారులు వెళ్లి పరిశీలించారు. సదర్మాట్ ఏడుమ కాలువకు మొత్తం 6 షటర్లు ఉన్నాయి. ప్రస్తుతం రెండు కొట్టుకుపోవటం వలన కాలువలోకి గోదావరి నది వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తుంది. దీనితో కొట్టుకుపోయిన గేట్లు వరద ప్రవాహంతో కనబటంలేదు. అయితే కాలువకు వరద నీరు తగ్గించేందుకు గోదావరి నది లోకి వెళ్లే రెండు గేట్ల పైకి ఎత్తి నీటిని మల్లించే ప్రయత్నం చేశారు. ఈ విషయమై జేఈ నితిన్‌ను సంప్రదించగా, ఒక గేటు కొట్టుకుపోగా, మరొకటి ఊడి పడిపోయిందని, గోదావరిలో ప్రస్తుతం ప్రవాహం ఎక్కువగా ఉన్నందున, నీరు తగ్గిన తరువాత మరమ్మతులు చేయిస్తామని తెలిపారు.