Free Medical Camp in Khanapur Surjapur by BRS Party: ఖానాపూర్,ఆగస్టు 24(మన బలగం): ఖానాపూర్ మండలంలోని సుర్జాపూర్ లో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలో సీజనల్ వ్యాధులు మలేరియా, డెంగ్యూ వ్యాధులతో ప్రజలు బాధ పడుతుందటంతో బీఆర్ఎస్పార్టీ నియోజకవర్గం ఇంచార్జి బుక్య జాన్సన్ నాయక్ కు సమస్య వివరించారు. నిర్మల్ కు చెందిన డాక్టర్ రమేష్ రెడ్డి, వారి హాస్పిటల్స్ సిబ్బంది ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. 400 మందికి వైద్య పరీక్షలు చేసి, ఉచిత మందులు అందజేశారు. కార్యక్రమంలో వైద్యులు వేణుగోపాల్, శ్రీనివాస్, నాగరాజ్ ఆర్తో, టిఆర్ఎస్ నాయకులు బూసి నరేందర్, అనుపహరీష్, బక్క శెట్టి అశోక్, రాజేందర్, జంగిలి రాజేందర్, అభిషేక్, రాజేందర్, జంగిలి రాజేందర్, బొమ్మెన రాకేష్ తదితరులు పాల్గొన్నారు.