108 Ambulance Start: వెల్గటూర్, డిసెంబర్ 10 (మన బలగం): వెల్గటూర్ మండలానికి మంజూరైన 108 అంబులెన్సును మంగళవారం వెల్గటూర్ సివిల్ ఆసుపత్రి వద్ద ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా వైద్యాధికారులు, మండల నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ వైద్యాధికారులు అంబులెన్సు సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ధర్మపురిలో మాతా శిశు ఆసుపత్రి, జిల్లా సివిల్ ఆసుపత్రిలో ఐసీయూ యూనిట్‌ను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.