Ambedkar statue unveiling: ధర్మపురి, డిసెంబర్ 15 (మన బలగం): అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆదివారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆవిష్కరించారు. అంబేద్కర్ యువజన సంఘం తిమ్మాపూర్ ఆధ్వర్యంలో నాయకులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ దేశం కోసం చేసిన సేవలు మరువలేనివన్నారు. వారు చేసిన చట్టాల ద్వారానే ప్రభుత్వాలు నడుస్తూ ముందుకు వెళ్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంబేద్కర్ రాసిన చట్టం వల్లనే సాధ్యం అయిందన్నారు. వారు తీసుకువచ్చిన రిజర్వేషన్లతోనే ఈ రోజు ధర్మపురికి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం వచ్చిందన్నారు. కార్యక్రమంలో దళిత సంఘల నాయకులు, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.