SA writing test: నిర్మల్, అక్టోబర్ 25 (మన బలగం): పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని ఎస్పీ డాక్టర్ జి.జానకి షర్మిల ఐపీఎస్ ఆదేశానుసారం ఏఆర్ ముఖ్య కార్యాలయంలో పోలీస్ సిబ్బందికి ఎస్ఏ రైటింగ్ కాంపిటేషన్ టెస్ట్ నిర్వహించారు. ‘సమాజంలో పోలీసు ప్రతిష్టను మెరుగుపరచడంలో పోలీసుల పాత్ర’ అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించారు. ఇందులో కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ వరకు పాల్గొని పరీక్ష రాసారు. ‘దృఢమైన శరీరంలో దృఢమైన మనస్సు’ అనే అంశంపై ఎస్ఐ నుంచి పై స్థాయి అధికారులకు ఎస్ఏ రైటింగ్ నిర్వహించారు. కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ వరకు ముగ్గురిని సెలెక్ట్ చేసి, ఎస్ఐ నుంచి పై స్థాయి అధికారి వరకు ముగ్గురిని సెలెక్ట్ చేసి ఆరుగురు పేర్లు రాష్ట్ర స్థాయికి పంపించారు. రాష్ట్రస్థాయిలో సెలెక్ట్ అయిన పోలీస్ అధికారులకు సిబ్బందికి అప్రిసియేషన్ సర్టిఫికెట్, నగదు రివార్డు అందజేశారు.