Request for new ration cards
Request for new ration cards

Request for new ration cards: కొత్త రేషన్ కార్డుల కోసం వినతి

Request for new ration cards: ధర్మపురి, నవంబర్ 2 (మన బలగం): కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు చెందోలీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్మపురి డిప్యూటీ తహసీల్దార్‌కు శనివారం వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రేషన్ కార్డులు మంజూరు కాలేదన్నారు. దీంతో అర్హత ఉన్నా పేదలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందక చాలా నష్టపోయారని తెలిపారు. అర్హులైన నిరుపేద కుటుంబాలకు రేషన్ కార్డులు అందించి న్యాయం చేయాలని కోరారు. ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు రుణమాఫీలో రేషన్ కార్డు అనుసంధానం చేయడంతో చాలా మంది రైతులు అనర్హులుగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

గత పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డులో తమ కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేయలేక పోతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొత్త రేషన్ కార్డులను త్వరగా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు చెందోలీ శ్రీనివాస్ ఎమ్మార్పీఎస్ టౌన్ అధ్యక్షులు పులి ప్రేమిత్, జిల్లపెల్లి భీమయ్య, బచ్చలి రాజయ్య, శనిగరపు లచ్చయ్య, ఉపరపు రాయనర్సు, రత్నం దుర్గయ్య, దుర్గం సత్తయ్య, దూడ జైపాల్, పులి చిన్ని, దూడ మహేందర్, మోదిగం శ్రీనివాస్, రాజేందర్, సుధాకర్, రాయిల్లా రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *