Financial aid for medical student: నిర్మల్, నవంబర్ 2 (మన బలగం): నిరుపేద వైద్య విద్యార్థికి ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నాడు నిర్మల్ చెందిన ఆయిండ్ల చంద్రమోహన్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలానికి చెందిన పూసం అశోక్ హైదరాబాద్‌లో ఎంబీబీఎస్ సీటు సాధించారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఈయనకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో హాస్టల్ ఫీజు చెల్లించేందుకు ఇబ్బందులకు గురయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న చంద్రమోహన్ రెడ్డి రూ.1,65,000 చెక్కును కుటుంబీకులకు అందించారు. బుక్స్ కోసం అదనంగా రూ.20 వేలు అందించారు. నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన చంద్రమోహన్ రెడ్డిని కుటుంబీకులు అభినందించారు. కార్యక్రమంలో జర్నలిస్ట్ కాలనీ అధ్యక్షులు భీంరెడ్డి, మాజీ సర్పంచ్ నర్సారెడ్డి, సిర్గు భీంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.