MLA Eleti Maheshwar Reddy inaugurates CC road works in Sirgapur: దిలావర్‌పూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో రూ.35 లక్షలతో ఎస్సీ కాలనీల్లో నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో కురుమ సంఘ భవనానికి భూమి పూజ చేసారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మాజీ నిర్మల్ మండల పరిషత్ అధ్యక్షులు వి.సత్యనారాయణ గౌడ్, తాజా మాజీ జడ్పీటీసీ తక్కల రమణ రెడ్డి, నాయకులు ముత్యం రెడ్డి, సత్యం చంద్రకాంత్, వీరేశ్, మండల అధ్యక్షులు నర్సారెడ్డి, నాయకులు రాజేశ్ రెడ్డి, జమాల్‌తోపాటు బీజేపీ మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.