Hindi Language Day in Maskapur High School: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం హిందీ భాష దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో హిందీ భాష కోసం కృషి చేసిన కవులు కబీర్‌తో పాటు హిందీ కోసం తపన పడిన రచయితలను వక్తలు స్మరించుకున్నారు. విద్యార్థులు హిందీలో ఉపన్యాసాలు, నృత్యాలు ప్రదర్శన చేసి, హిందీ భాష మాధుర్యాన్ని విపులీకరించారు. భవిష్యత్‌లో భాష ప్రాముఖ్యం గురించి తెలిపారు. పాఠశాలలో హిందీ బోధకులు జాగ్ధాండ్ లక్ష్మణరావు, రమేష్, గంగాధర్‌లను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బోనగిరి నరేందర్ రావు, తొంటి శంకర్, కుర్ర శేఖర్, వెన్నం అంజయ్య, దొమ్మాట శోభారాణి, పుప్పాల స్వప్న తదితరులు పాల్గొన్నారు.
