suicide attempt: నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల పోలీసు స్టేషన్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. స్టేషన్‌లో ఎస్సై ఎదుట తలదువ్వినందుకు ఓ యువకుడికి సదరు ఎస్సై గుండు గీయించాడు. అవమానాన్ని భరించలేక యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ప్రస్తుతం దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పెట్రోల్ బంకులో తలెత్తిన వివాదంలో సతీశ్ అనే యువకుడితోపాటు మరో ఇద్దరిని స్టేషన్‌కు పిలిపించారు. వీరిని విచారిస్తున్న సమయంలో సతీశ్ తల దువ్వుకున్నాడు. దీంతో ఎస్సై ఆగ్రహంతో మండిపోయాడు. నా ముందే తల దువ్వుకుంటావా అంటూ సతీశ్‌తోపాటు మరో ఇద్దరు యువకులకు గుండు గీయించి ఇంటికి పంపారు. దీంతో మనస్తాపం చెంది సతీశ్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించారు. ప్రస్తుతం నాగర్‌కర్నూల్ దాఖానలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన పోలీస్ డిపార్ట్‌మెంటులో కలకలం రేపుతోంది. పోలీసు ఉన్నతాధికారులు దీనిపై విచారణకు ఆదేశించినట్లు సమాచారం.