స్పందించిన జిల్లా కలెక్టర్
Suspended: నిర్మల్, ఫిబ్రవరి 1 (మన బలగం): జిల్లా అధికారులు స్పందించారు. కలెక్టర్ కార్యాలయంలో సీసీగా విధులు నిర్వహిస్తున్న రాకేశ్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. పట్టణ పొలిమేరలోని ఓ పామ్ హౌస్‌లో వివాహిత మహిళతో రెడ్ హ్యాండెడ్ పట్టుబడిన కలెక్టర్ సీసీ రాకేశ్ ఎట్టకేలకు సస్పెండ్ అయ్యారు. ఉన్నత స్థాయి ఉద్యోగంలో ఉంటూ రాసలీల కేసులో పట్టుబడడం జిల్లాలో చర్చనీయాంశంగా తయారయింది. మూడు రోజుల క్రితం సంఘటన జరిగినప్పటికీ అధికారులు స్పందించకపోవడం పట్ల ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అయింది. ఎట్టకేలకు స్పందించిన అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.
కలెక్టర్ కార్యాలయ సీసీ సస్పెండ్
కలెక్టర్ కార్యాలయంలో సీసీగా విధులు నిర్వహిస్తున్న రాకేశ్‌ను విధుల నుంచి తొలగించినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలో ఇటీవలి చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా జిల్లా కలెక్టర్ సీసీగా విధులు నిర్వహిస్తున్న రాకేశ్‌ను విధుల నుంచి తప్పిస్తున్నట్లు తెలిపారు. ఘటనపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతమైతే సంబంధిత ఉద్యోగులపై కఠిన చర్యలు ఉంటాయని, విధులకు చెడ్డ పేరు తీసుకువచ్చేలా ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగి, బాధ్యతగా, క్రమశిక్షణగా నడుచుకోవాలని ఆ కలెక్టర్ ప్రకటనలో తెలిపారు.