- టీ-20 వరల్డ్ కప్ కైవసం
- ఫైనల్‌లో సౌతాఫ్రికాపై 9 వికెట్లతో విక్టరీ
U19WorldCup: అండర్-19 ఉమెన్స్ టీ-20 వరల్డ్ కప్‌ను ఇండియా కైవసం చేసుకున్నది. మహిళల జట్టు జగజ్జేతగా నిలిచి భారత్‌కు గర్వకారణంగా నిలిచారు. ఆదివారం కౌలాలంపూర్ వేదికగా సౌతాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్ జరిగింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికాకు భారత బౌలర్లు చుక్కుల చూపించారు. 20 ఓవర్లు ఆడినా సౌతాఫ్రికా 10 వికెట్లు నష్టపోయి కేవలం 82 పరుగులు మాత్రమే చేసింది. గౌంగిడి సునీత మూడు వికెట్లు తీసి సౌతాఫ్రికాకు కోలుకోలేని దెబ్బతీసింది. సిసోడియా, ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మా రెండేసి వికెట్లు తీశారు. శబ్నమ్ ఒక వికెట్ తీసింది. తరువాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ కేవలం ఒక వికెట్ మాత్రమే నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. గొంగిడి సునీత 44, సాయినిక 26 పరుగులు చేసి భారత్‌ను విజయతీరాలకు చేర్చి చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఓపెనర్ కమలిని 8 పరుగులు మాత్రమే చేసింది.