- ముంబై ఇండియన్స్ సూపర్ విక్టరీ
- ఆర్సీబీ ఘోర ఓటమి
- అర్ధ సెంచరీలతో చెలరేగిన ఇషాన్, సూర్య
- ఏడు వికెట్లతో ముంబై గెలుపు
- 196 పరుగల లక్ష్యం అలవోకగా ఛేదన
IPL 2024, MI vs RCB: ముంబై ఇండియన్స్ ట్రాక్‌లోకి వచ్చింది. హ్యాట్రిక్ పరాజయాల తరువాత విజయాల బాట పట్టింది. వరుస ఓటముల తరువాత తేరుకున్న ముంబై ఢిల్లీపై 29 పరుగుల తేడాతో మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. గురువారం ఆర్సీబీ(RCB)తో జరి గిన మ్యాచ్‌లో ముంబై రెండో విజయాన్ని అందు కుంది. హోమ్ గ్రౌండ్ వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై బ్యాటర్స్ చెలరేగిపోయారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముం బై బెంగళరూను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 196 పరుగులు చేసింది. భారీ స్కోర్ చేసినా కాపాడుకోవడంతో బెంగళూరు పూర్తిగా విఫలమైంది.
ధాటిగా ఆరంభించిన ముంబై
మొదటి నుంచి ధాటిగా ఆడిన ముంబై బ్యాటర్లు ఏ దశలోనూ ఆర్సీబికి చాన్స్ ఇవ్వలేదు. ఓపెనర్లు ఇషాన్ కిషన్ ఆరంభం నుంచి ధాటిగా ఆడాడు. 34 బాల్స్‌లోనే 69 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సిక్సులు, ఏడు ఫోర్లు ఉన్నాయి. రోహిత్ శర్మ 24 బాల్స్‌లో మూడు ఫోర్లు, మూడు సిక్స ర్లతో 38 పరుగులు చేశాడు. 101 పరుగుల భా గస్వామ్యానికి 8.5వ ఓవర్‌లో తెరపడింది. ఇషాన్ కిషన్ (ISHAN KISHAN) మొదటి వికెట్‌గా వెనుదిరిగాడు. తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన సూర్య కుమార్ (SURYA KUMAR) మరింత ధాటిగా ఆడాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 19 బాల్స్‌లోనే 52 ప రుగులు చేశాడు. నాలుగు సిక్సులు, ఐదు ఫోర్లు బాదాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(HARDIKPANDYA) మూడు సిక్సులు బాది కేవలం ఆరు బాల్స్‌లో 21 పరుగులు చేశా డు. తిలక్ 10 బాల్స్‌లో 16 పరుగులు చేశాడు.
భారీ స్కోర్ చేసినా..
మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు ఆదిలోనే వికెట్ కోల్పోయింది. మూడో ఓవర్‌లోనే కొహ్లీ (KOHLI) 3 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కెప్టెన్ డుప్లెసిస్ 61(40) పరుగులు చేశాడు. పటిదార్ 50(26) చేశారు. దినేశ్ కార్తిక మెరుపులు మెరిపించాడు. కేవలం 23 బాల్స్‌లో నాలుగు సిక్సు లు, ఐదు ఫోర్ల సాయంతో 53 పరుగులు చేశా డు. విల్ జాక్స్(8), మాక్స్ వెల్ (0), లొమరోర్ (0), సౌరవ్ చౌహాన్ (9), విజయ్ కుమార్ (0) తక్కువ స్కోరుకే అవుట్ అయ్యారు. 19వ ఓవర్ లో వరుసగా రెండు వికెట్లు పడడంతో బెంగ ళూరు 200 స్కోర్ మార్కును దాటలేకపోయిం ది. బుమ్రా స్పెల్‌లో సౌరవ్ చౌహాన్, విజయ్ కుమార్‌లను వెనువెంటనే ఔట్ చేయడంతో రావాల్సిన పరుగులకు అడ్డుకట్ట పడింది. దీంతో 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. ముంబై 15.3 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో ఆర్సీబీపై 7 వికెట్ల తేడాతో విజయాన్ని కైవసం చేసుకున్నది.