Harbhajan: పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు రావడంపై మాజీ ఇండియా క్రికెటర్ సీఎస్కే ప్లేయర్ హర్భజన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. 16వ ఓవర్‌లో మిచెల్ సాంట్నర్ అవుట్ కాగానే బ్యాటింగ్‌కు ధోని వస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా శార్దూల్ ఠాకూర్‌ను పంపించారు. ఇలా పంపడంపై మాజీ క్రికెటర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
టీం ఇండియా మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోని ఇలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కావడం లేదు. ఆయన ఏం ఫాస్ట్ బౌలర్ కాడు కదా.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగడానికి శార్దూల్ ఠాకూర్ కంటే బాగా బ్యాటింగ్ చేయగల సమర్థుడు ధోని. అయినా ఇలాంటి కఠిన పిచ్‌లపై 9 వ స్థానంలో బ్యాటింగ్ చేస్తే అది టీంకు ఎఫెక్ట్‌గా మారుతుందని ధోనికి తెలియదా.. ఒక వేళ టీం మేనేజ్‌మెంట్ గనక ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మాత్రం కచ్చితంగా అది సరైనది కాదని నా అభిప్రాయం అని హర్బజన్ సింగ్ నిరాశ వ్యక్తం చేశాడు.
చెన్నై కెప్టెన్ ధోని బ్యాటింగ్ ఆర్డర్‌ను డిసైడ్ చేసే స్థాయిలో లేకున్నా.. ధోని ఎప్పుడు రావాలనుకున్నా రాగలడు. కానీ మరీ తొమ్మిదో ప్లేస్‌లో బ్యాటింగ్‌కు వస్తే అప్పటికే అంతా జరిగిపోయి ఉంటుంది. పోనీ తొమ్మిదో స్థానంలో వచ్చి ఏమైనా చేశాడంటే హర్షల్ పటేల్ బౌలింగ్‌లో స్లో యార్కర్‌కు మొదటి బంతికే బౌల్డ్ అయి పెవిలియన్‌కు చేరాడు.
మ్యాచ్ అనంతరం రుత్ రాజ్ మాట్లాడుతూ.. పిచ్ స్లోగా ఉండడంతో నెమ్మదిగా ఆడాల్సి వచ్చింది. ముందుగా 180 నుంచి 200 వరకు చేస్తే చాలనుకున్నాం. కానీ వికెట్లు పడిన కొద్దీ 160-170 చేసినా సరిపోతుందనిపించింది. 162 పరుగులు చేసిన చెన్నై పంజాబ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసి పాయింట్స్ టేబుల్స్‌లో మూడో స్థానానికి చేరుకుంది.