IPHONE
IPHONE

iPhone broken: డారెల్ మిచెల్ కొడితే.. స్టేడియంలో ప్రేక్షకుడి ఐఫోన్ ఫట్

iPhone broken: ఐపీఎల్‌లో సిక్సుల మోత మోగుతోంది. ఒక్కో మ్యాచ్‌లో 10 నుంచి 15 సిక్సుల వరకు కొడుతూ ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తున్నారు. అయితే మ్యాచ్‌లో సిక్సులు కొట్టిన సమయంలో చాలా మందికి ఆ బాల్ తగిలి గాయాలవుతుంటాయి. కానీ వాటిని ఎవరూ పట్టించుకోరు.. మ్యాచ్‌ను ముగించాలనే ఆతృతలో ఫ్యాన్స్‌కు తగిలిన గాయాల్ని ఎవరూ లెక్క చేయరు.

ఆదివారం పంజాబ్‌తో చెన్నై మ్యాచ్ ధర్మశాలలో జరిగింది. ఈ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న చెన్నై ఆటగాళ్లు నెట్స్‌లో సాధన చేస్తున్నారు. నెట్స్ దాటి వచ్చి నార్మల్‌గా షాట్లు ప్రాక్టీస్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు డారెల్ మిచెల్.. ఫుల్ షాట్లు ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఫుల్‌ షాట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఒక షాట్ అనుకోకుండా బలంగా స్టాండ్స్‌లోకి వెళ్లింది. దీంతో అక్కడ ఇండియా జెర్సీ వేసుకుని కూర్చున్న ఒక వ్యక్తికి తాకింది. అంతే అతడి చేతిలో ఉన్న ఐఫోన్ పగిలిపోయింది.
ఆ షాట్‌కు వారందరూ ఒక్కసారిగా ప్రాణాలు కాపాడుకోవడానికి కిందకు వంగారు. షాట్ కొట్టిన డారెల్ మిచెల్ అతడికి ఫోన్ కొనివ్వలేదు. కానీ హ్యాండ్ గ్లౌవ్స్‌ను ఐఫోన్ పగిలిపోయిన ప్రేక్షకుడికి ఇచ్చి సంతృప్తి పరిచాడు. స్టేడియంలో ఓ అభిమాని ఈ ఇన్సిడెంట్‌ను మొత్తం రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో ఇది కాస్త వైరల్‌గా మారింది. డారెల్ మిచెల్ గొప్పతనాన్ని కామెంట్ల రూపంలో పంచుకుంటున్నారు. భయ్యా ఫోన్ పగిలితే ఇంకోటి కొనుక్కోవచ్చు.. తల పగిలితే రాదు భయ్యో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కొంచెం చూసి కొట్టన్న అంతా బలంగా కొట్టావు. కొంచెం ఉంటే ప్రాణాలు పోతుండేరా అనే శ్రీహరి డైలాగ్‌ను వాడేస్తున్నారు. ఇలా గ్రౌండ్‌లోకి సిక్సులు కొట్టిన సమయంలో అనేక మందికి ఇప్పటి వరకు గాయాలైన సంఘటనలు ఉన్నాయి. అందులో ఇదొకటి. వీడియో వైరల్ కావడంతో అది కాస్త బయటకు వచ్చింది. కాబట్టి ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకు వెళ్లే ప్రేక్షకులు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటూ సూచనలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *