VIRAT KOHLI, IPL 2024: విరాట్ కొహ్లీ అనగానే అగ్రిసెవ్‌నెస్ అని అందరికీ ఠక్కున గుర్తొస్తుంది. మైదానంలో చిరుతలా కదిలే విరాట్ ప్రత్యర్థులను ఆటతోనే కాదు మాటలతో కూడా గట్టిగానే సమాధానమిస్తాడు. విరాట్ కొహ్లీకి గౌతం గంభీర్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఉంటాయి. ఐపీఎల్‌లో నవీన్ ఉల్ హక్‌తో గొడవ పడ్డాడు. దీంతో గౌతం గంభీర్ మధ్యలో రావడంతో అది కాస్త చినికి చినికి గాలివానలా మారింది.
విరాట్ కొహ్లి ఇప్పటి వరకు గ్రౌండ్‌లో ఎంతో మంది క్రికెటర్లకు వారి భాషలోనే స్లెడ్జింగ్ చేసి నోరు మూయించేవాడు. కానీ ఈ మధ్య ఐపీఎల్‌లో ఆర్సీబీ మ్యాచులు చూస్తుంటే సైలెంట్‌గా ఉండిపోతున్నాడు. గౌతం గంభీర్‌ను హగ్ చేసుకోవడం, నవీన్ ఉల్ హక్‌తో షేక్ హ్యాండ్ ఇవ్వడంతో జనాలు మసాలా మిస్ అవుతున్నారని కొహ్లీనే స్వయంగా చెప్పుకొచ్చాడు.
నా నుంచి అగ్రెసివ్ కోరుకుంటున్నారు
ముంబైతో వాంఖడేలో జరగబోయే మ్యాచ్ కోసం ముంబయి వచ్చి విరాట్ ఓ ప్రైవేటు ప్రోగ్రాంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జనాలు నా నుంచి అగ్రెసివ్ కోరుకుంటున్నారు. నేను కాస్త సైలెంట్ అయిపోయే సరికి మసాలా మిస్ అయిందని భావిస్తున్నారు. గౌతీతో హగ్ చేసుకోవడం వల్ల చాలా మందికి నచ్చడం లేనట్లుంది అని అన్నాడు. దీంతో అక్కడి ప్రోగ్రాంలో అందరి మొహల్లో నవ్వులు విరబూశాయి.
అభిమానులు డిసప్పాయింట్
విరాట్ కొహ్లీ ఎవరి కోసమే మారాల్సిన అవసరం లేదని నెటిజన్లు స్పందిస్తున్నారు. విరాట్‌కు తన దూకుడు స్వభావమే నప్పుతుందని కామెంట్లు చేస్తున్నారు. మొత్తం మీద విరాట్ గ్రౌండ్‌లో కూల్‌గా కనిపించడంతో అభిమానులు సైతం డిసప్పాయింట్ అవుతున్నారు. ఆటైనా, వ్యక్తిత్వమైనా దూకుడైనా విరాట్ తనలాగే ఉండాలని కోరుకుంటున్నారు.