Pending bills should be released immediately: మనబలగం, కరీంనగర్ బ్యూరో: పి.ఆర్.సి. ప్రకటించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న డి.ఏ.లు, ఇతర బిల్లులు తక్షణమే విడుదల చేయాలని టి.పి.యు.ఎస్. రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సిరిసిల్లలో ఉపాధ్యాయ ధర్మాగ్రహ దీక్ష నిర్వహించారు. అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గసికంటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి లెంకల జయకృష్ణ, రాష్ట్ర కార్యదర్శులు వోడ్నాల జగన్ మోహన్, కటకం శ్రీనివాస్ జిల్లా, మండల బాధ్యులు మధుసూదన్ రావు, ప్రవీణ్, తిరుపతి, శ్రీనివాస్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.