Two arrested for transporting ganja: బుగ్గారం, నవంబర్ 5 (మన బలగం): మండలంలోని వెల్గొండ క్రాస్ రోడ్ వద్ద గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బుగ్గారం మండలం వెల్గొండ గ్రామానికి చెందిన గుజ్జేటి వంశీ, ధర్మపురికి చెందిన తుమ్మ ఉపేందర్ నుంచి 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వంశీ కొన్ని నెలల నుంచి గంజాయికి బానిసయ్యాడు. తన వద్ద ఉన్న గంజాయిని తనకు కావలసినంత తాగి మిగతాది ఇతరులకు అమ్మేవాడు. ఈ క్రమంలో ధర్మపురికి చెందిన తుమ్మ ఉపేందర్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి వారికి కావలసినంత వారు వినియోగించి మిగతాది తమ యొక్క అవసరాలకు, జల్సాలకు గంజాయిని ఇతరులకు అమ్మేవారు. మంగళవారం సైతం ఇతరులకు అమ్మే క్రమంలో బుగ్గారం పోలీసు వారు సరైన సమాచారాన్ని తెలుసుకొని వారిని వెల్గొండ క్రాస్ రోడ వద్ద అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.