Maulana Abul Kalam Azad Jayanti
 Maulana Abul Kalam Azad Jayanti

Maulana Abul Kalam Azad Jayanti: నిర్మల్‌లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి

 Maulana Abul Kalam Azad Jayanti: నిర్మల్, నవంబర్ 5 (మన బలగం): నిర్మల్ జిల్లా కేంద్రంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ నగర్‌లో స్వాతంత్ర్య సమరయోధులు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వారోత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మౌలానా అబుల్ కలాం ఆజాద్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ప్రముఖ జాతీయ కవి, రచయిత బొందిడి పురుషోత్తం, సొసైటీ జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్ మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్ర్య సమరంలో పోషించిన పాత్ర మహోన్నతమైదని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం దేశ తొలివిద్య శాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశంలో విద్యా సాంకేతిక పరమైన అభివృద్ధికి తనవంతు కృషి చేశారని స్మరించుకున్నారు. నిర్మల్‌లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్మారకార్థం నిర్మిస్తున్న క్లాక్ టవర్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో సొసైటీ పట్టణ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ అలీ, కోశాధికారి శేఖ్ షాదుల్లా హుస్సేన్, అబ్దుల్ ఖదీర్, శేఖ్ మౌలానా ఇబ్రహీం, మసూద్ ఖాన్ కాంగ్రెస్ యువజన నాయకులు మహమ్మద్ ఎహెతెష్యాం, షాహిద్, షరీఫ్, షాదాబ్ అక్రం అలీ, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *