Celebrations of BC: ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 5 (మన బలగం): బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ కల్పించడంపై ఎల్లారెడ్డిపేట మండల బీసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని స్థానిక పాత బస్టాండులో బుధవారం టపాకాయలు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ బీసీలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 42 శాతం రిజర్వేషన్ కల్పించడం హర్షణీయమ్నారు. సీఎం రేవంత్ రెడ్డికి బీసీల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్.కె సాబేరా బేగం గౌస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, బుచ్చిలింగు సంతోష్ గౌడ్, బండారి బాల్రెడ్డి, గుర్రపు రాములు, గంట వెంకటేష్ గౌడ్, గంట అంజాగౌడ్, పందిర్ల సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.