Holi celebrations: నిర్మల్, మార్చి 13 (మన బలగం): వశిష్ట ఇంపల్స్ ఈ టెక్నో స్కూల్ ఆదర్శ్‌నగర్‌లో ముందస్తు హోళీ పండుగను ఘనంగా నిర్వహించారు. పిల్లలు రంగులు చల్లుకుంటూ వారిమధ్య గల స్నేహ మరియు సోదర భావాల్ని వ్యక్తపరుచుకుంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఇది ఒక సామాజికమైన పండుగ అని, ప్రతి పండగల్లా పూజలతో కాకుండా రంగులు చల్లుతూ పండుగ జరుపుతారని, ఈ పండగ పురాణ కథలతో ముడిపడి ఉందని తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ గొల్లపల్లి మాధవి, పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ దేవిదాస్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
