International Meditation Day
International Meditation Day

International Meditation Day: ధ్యానం, యోగాతో సంపూర్ణ ఆరోగ్యం : జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

International Meditation Day: జగిత్యాల, డిసెంబర్ 21 (మన బలగం): సంపూర్ణమైన ఆరోగ్యం కోసం భారతదేశ ప్రాచీన వారసత్వంగా వచ్చిన ధ్యానం, యోగా అని, వీటితో మానసిక, శారీరక ఆరోగ్యంపై పట్టు సాధించవచ్చు అని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. శనివారం అంతర్జాతీయ మొదటి మెడిటేషన్ (ధ్యానం) దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ మెడిటేషన్ (ధ్యానం) దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నిత్యం తీరికలేకుండా ఉండే అధికారులు, సిబ్బంది నిత్యం ధ్యానం, యోగా సాధనతో తమ ఆరోగ్యంపై సంపూర్ణ పట్టుసాధించవచ్చన్నారు. అధికారులు, సిబ్బంది నిత్యం విధినిర్వహణలో ఉండటం వలన తమ ఆరోగ్యంపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తారని, ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు సమర్థవంతంగా సేవలు అదించగలమని అన్నారు.

మిగతా ఎక్సర్సైజ్ లే కాకుండా, ఎక్కడైనా, ఎలాంటి వ్యాయామ పరికరాలు అవసరం లేకుండా ఆరోగ్యాన్ని మానసిక సమతుల్యత లభించే ఏకైక మార్గం ధ్యానం, యోగా అని అన్నారు. యోగా ద్వారా మెరుగైన జీవనం, అద్భుతమైన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం, ఉత్తమ ఆలోచనలు వస్తాయన్నారు. అధికారులు, సిబ్బంది యోగాను దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకొని ఆనందమయ జీవితాన్ని పొందాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ అరగంట పాటు యోగా సాధన చేస్తే అనారోగ్యం పాలుకాకుండా ఉండవచ్చని ఎస్పీ సూచించారు. ఈ సందర్భంగా యోగా శిక్షకులతో కలిసి ఎస్పీ, అధికారులు, సిబ్బంది ధ్యానం, యోగా సాధన చేశారు. కార్యక్రమంలో డీఎస్పీలు రఘుచందర్, రాములు, సి.ఐ శ్రీనివాస్, రామ్ నర్సింహారెడ్డి, ఆరిఫ్ అలీ ఖాన్, వేణుగోపాల్, ఆర్.ఐ రామక్రిష్ణ, వేణు, ఎస్.ఐలు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *